No Entry for Ambulance: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. సరిహద్దుల్లో అంబులెన్స్‌ను ఇంకా అడ్డుకుంటున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రోగి బంధువులతో గంటల తరబడి వాగ్వాదం కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా ఉధృతి (Corona pandemic) నేపధ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేస్తున్నారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యం కోసం వెళ్తున్న రోగుల్ని ఎలా అడ్డుకుంటారని హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదు. అంబులెన్స్‌లను ఆపకూడదని ఆదేశాలిచ్చినా బేఖాతరు చేస్తున్నారు. వరుసగా రెండవ రోజు కూడా ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో(Ap-Telangana Borders) అంబులెన్స్‌లను ( Ambulances) నిలిపివేస్తున్నారు. తనిఖీ చేసి..తెలంగాణ ఆసుపత్రుల్లో బెడ్ ఉన్నట్టు అనుమతి పత్రాలు చూపిస్తేనే వదులుతున్నారు. అయితే ఇదంతా నిన్నటి సంగతి. రెండవ రోజు పోలీసులు మరికాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనుమతి పత్రాలతో పాటు సంబంధిత ఆసుపత్రి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్‌లో తమతో మాట్లాడిస్తేనే వదులుతున్నారు. 


కొందరికైతే వెంటనే ఫోన్‌లు రావడంతో వదులుతున్నారు. మరికొందరికి ఫోన్ రావడం ఆలస్యమవుతోంది. దాంతో పోలీసులు, రోగి బంధువులు వాగ్వాదానికి దిగుతున్నారు. కొందరికైతే 40 నిమిషాలపాటు నిలిపేస్తున్నారు. ప్రయాణ సమయాన్ని అంచనా వేసుకుని సరిపడేంత ఆక్సిజన్ ( Oxygen) నింపుకుని వస్తున్న రోగులకు దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే విషయంపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద ఇదే పరిస్థితి ఎదురైంది. అటు వాడపల్లి కృష్ణానది వంతెన చెక్ పోస్టు వద్ద కూడా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను(Ambulances) నిలిపివేస్తున్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చేరేందుకు ముందస్తు అనుమతి ఉన్న వాహనాల్నే అనుమతించారు.


Also read: Telangana సరిహద్దుల్లో అంబులెన్సులు ఆపొద్దు: తెలంగాణ హై కోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook