తెలంగాణ అసెంబ్లీ రద్దుపై కాంగ్రెస్ రియాక్షన్
తెలంగాణ అసెంబ్లీ రద్దుపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏ కారణం చేత రద్దు చేయాల్సి వచ్చిందనే అంశాలను తెలంగాణ ప్రజానికానికి వివరించకుండానే అసెంబ్లీని రద్దు చేయడం ఏంటని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టుగా కేబినెట్ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయంపై స్పందిస్తూ ఇవాళ మధ్యాహ్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఏదేమైనా తెలంగాణలో జరగబోయే ముందస్తు ఎన్నికలను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచి తీరుతుందని తమ పార్టీ గెలుపుపై ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
ఇదిలావుంటే, ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.