Revanth Reddy speech highlights: ఖమ్మం జనగర్జన సభలో రేవంత్ రెడ్డి స్పీచ్ హైలైట్స్
Revanth Reddy Khammam Meeting Speech highlights: డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన జనగర్జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
Revanth Reddy Khammam Meeting Speech highlights: ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఖమ్మం జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఎంతో ఆవేశంగా ప్రసంగించారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తంచేసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా తిరిగి ఇదే ఖమ్మంలో కాంగ్రెస్ విజయోత్సవ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.
ఇదే ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి పునాది పడిందన్న రేవంత్ రెడ్డి.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబంలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించేందుకు మళ్లీ ఇదే ఖమ్మం నుంచి మరోసారి నాంది పలకాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ జనగర్జన సభకు జనం భారీగా తరలివచ్చారన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ పొలిమేరల నుంచి కేసీఆర్ కుటుంబాన్ని అండమాన్ వరకు తరమి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఖమ్మం సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదని సభా వేదికపై నుంచి మరోసారి గుర్తుచేసిన రేవంత్ రెడ్డి.. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వ గోడలను కూలగొట్టుకుంటూ ఖమ్మం సభకు తరలివచ్చారని అన్నారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన చేరిక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 10 సీట్లలో విజయం సాధించేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 109 రోజుల పాటు జనంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. భట్టి విక్రమార్క మార్చ్ యాత్రలో దృష్టి కొచ్చిన అంశాలు మేనిఫెస్టోగా ఉంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి : Rs 4000 Old Age Pension: తెలంగాణలో రూ. 4 వేల వృద్ధాప్య పెన్షన్.. బీఆర్ఎస్‌కి గట్టి దెబ్బ పడనుందా ?
వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ వివరించామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ. 4వేల పింఛన్ ఇవ్వనున్నామని రాహుల్ గాంధీ ఇదే ఖమ్మం జనగర్జన సభలో ప్రకటించిన విషయాన్ని రేవంత్ రెడ్డి మరోసారి గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి అనే రెండు పాదాలపై రాష్ట్రాన్ని నడిపిస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానంటే.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK