Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానంటే.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభా వేదికపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 

Written by - Pavan | Last Updated : Jul 3, 2023, 10:59 AM IST
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానంటే.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Ponguleti Srinivas Reddy Speech: ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభా వేదికపై మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతూనే.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి అనే అంశంపై ప్రసంగించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గత వారం రోజులుగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులతో బెదిరించినా.. మేము నీ వెంటే ఉన్నాం అంటూ నా వెంట వచ్చిన నా కుటుంబసభ్యులు అందరికీ పేరుపేరునా శిరస్సు వంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. 

గతంలో తెలంగాణ బిడ్డలు దశాబ్ధాల తరబడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా ఎవ్వరూ తెలంగాణ ఇవ్వలేదు. కానీ సోనియా గాంధీ 2014 లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ ఇచ్చారు. ఆనాడు సోనియా గాంధీకి తెలుసు.. తెలంగాణ పార్టీ ఇస్తే ఇకపై కాంగ్రెస్ పార్టీ ఉండదు అని. అయినా సరే తెలంగాణలో  ఆత్మహత్యలు నివారించాలి అంటే తెలంగాణ ఇచ్చి తీరాలి అనే ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఏవేవో వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణకు చేసింది ఏమీ లేదన్నారు. రైతుల రాజ్యం అని అన్నారు కానీ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే అత్యధికంగా సుమారు 8 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

రైతుల రుణాలు మాఫీ చేస్తాం అన్నారు. అది కూడా చేయలేదు. కానీ వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతుల కోసం డిక్లరేషన్ ప్రకటించారు. మీ అందరి దీవెనలతో తెలంగాణలో అధికారంలోకి రానున్న కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం రైతు డిక్లరేషన్‌ని అమలు చేసి తీరుతుందన్నారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు. అటు ఉద్యోగాలు ఇవ్వలేదు... కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఏదీ ఇవ్వకుండా యువత జీవితాలతో ఆడుకున్నారు అని కేసీఆర్ ఇచ్చిన హామీలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సభా వేదికపై ఏకరువు పెట్టారు. ప్రియాంకా గాంధీ నిరుద్యోగుల కోసం డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంటుందని యువతకు హామీ ఇస్తున్నాను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానంటే..
జనవరి 1 నుంచి ఇప్పటివరకు.. ఈ ఆరు నెలల పాటు ఆలోచించిన తరువాత ఒక నిర్ణయం తీసుకున్నాను. వివిధ ప్రాంతాల్లో పర్యటించాను. అన్ని సంఘాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలను కలిశాను. అందరి అభిప్రాయం ఒక్కటే. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరితే అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆ తరువాత ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గె, ప్రియాంకా గాంధీని కలిసిన తరువాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని నిర్ణయించుకున్నాం. ఏ వేదిక మీదకు వెళ్లినా సరే మీరు ఏదైతే చెప్పారో.. తాను అదే చేశాను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. 

ఇది కూడా చదవండి : Rs 4000 Old Age Pension: తెలంగాణలో రూ. 4 వేల వృద్ధాప్య పెన్షన్.. బీఆర్ఎస్‌కి గట్టి దెబ్బ పడనుందా ?

ఏదేమైనా అధికారం ఉందన్న అహంకారంతో, మధంతో కొట్టుకుంటున్న కేసీఆర్‌కి బుద్ధి చెప్పి, బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో వెయ్యాలంటే.. అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని.. ఎవరు ఔనన్నా.. కాదన్నా ఈ మాటే వాస్తవం అని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు మనందరం శక్తివంచన లేకుండా కృషి చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy speech highlights: ఖమ్మం జనగర్జన సభలో రేవంత్ రెడ్డి స్పీచ్ హైలైట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News