50% తగ్గింపు: వాహనదారులను పరుగులు పెట్టించిన ఫేక్ న్యూస్!
50% తగ్గింపు: వాహనదారులను పరుగులు పెట్టించిన ఫేక్ న్యూస్!
హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్లలో 50% తగ్గించి చార్జ్ చేస్తున్నారని, తగ్గించిన ట్రాఫిక్ చలాన్లను స్వీకరించేందుకు ట్రాఫిక్ లోక్ అదాలత్ పేరిట ఆదివారం హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు అని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫేక్‌న్యూస్ కారణంగా దానిని నమ్మి అక్కడికి చేరుకున్న కొంతమంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలో 50% రాయితీ కల్పిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ న్యూస్‌ను చూసి పలువురు వాహనదారులు గోషామహల్ స్టేడియం వద్ద బారులుతీరారు. అయితే, చాలామందికి అక్కడికి వెళ్లాకే తెలిసింది ఏంటంటే.. అది ఎవరో ఆకతాయిలు పనిగట్టుకుని చేసిన ఫేక్ ప్రచారం అని. "ట్రాఫిక్ లోక్ అదాలత్" అనేది ఓ ఫేక్ న్యూస్ అని తెలుసుకున్న వాహనదారులు ఉసూరుమంటూ అక్కడి నుంచి తిరుగుబాటపట్టారు.
ఇదిలావుంటే, ఫేక్‌న్యూస్‌లను నమ్మి మోసపోవద్దని, ట్రాఫిక్ లోక్ అదాలత్ పేరిట ట్రాఫిక్ చలాన్లలో 50% తగ్గింపు అధికారిక ప్రకటనలు ఏవీ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.