హైదరాబాద్: వాహనదారులు తమ వాహనాలపై సరైన నంబర్ ప్లేట్లు ఉపయోగించుకునేలా చూసేందుకు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో ఎత్తుగడ వేశారు. ఇటీవల అమీర్ పేట్ నుండి పంజాగుట్ట వైపు వస్తున్న టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ వాహనం, వెనుక వైపు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ఉండటంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని, సరైన నంబర్ ప్లేట్ ను వాహనానికి బిగించమని తెలిపారు. నంబర్ ప్లేట్ మార్చిన వెంటనే ఈ వాహనాన్ని బయటికి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ నగరమంతటా ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుధంగా ఉన్నవాహనాలను అదుపులోకి తీసుకుని, మోటారు వాహన చట్టం ప్రకారం అన్నీ రకాల అనుమతులు ఉంటేనే అనుమతించబడతాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 


గత ఏడాది నుండి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్‌లలోని ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్దంగా ఉన్న వాహనాల వాడకంపై సుమారు 1.5 లక్షల కేసులను నమోదు చేశామని, నేరస్థులు వాహన నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం,  తీవ్రమైన నేరాలకు పాల్పడటం వంటివి తమ దృష్టికి వచ్చాయని పోలీసులు తెలిపారు. 


అదేవిధంగా, జాతీయ రహదారుల్లోని ప్రమాదాలు, హిట్-అండ్-రన్ కేసులలో, వాహనాన్ని గుర్తించకుండా ఉండటానికి యజమానులు నంబర్ ప్లేట్ నుండి అంకెలను, వర్ణమాలను తొలగిస్తున్నందున వాహనాన్ని గుర్తించడం కష్టమైందని పోలీసులు పేర్కొన్నారు. ఇటువంటి అక్రమాలపై త్వరితగతిన గుర్తించేందుకు నగరమంతా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోన్నట్టు తెలిపారు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..