Video: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు-ఎవరూ సాయం చేయని వేళ-ఆ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
Viral video of Telangana police: తెలంగాణ పోలీస్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూశాక పోలీస్ అంటే భయం కన్నా వారి పట్ల గౌరవం పెరుగుతుందనడంలో సందేహం అక్కర్లేదు.
Viral video of Telangana police: పోలీస్ అనగానే చాలామందికి భయం పుట్టుకొస్తుంది. పోలీసులతో వ్యవహారమంటే తెలియని భయం వెంటాడుతుంది. అందుకే ఇప్పటికీ చాలామంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే వణికిపోతుంటారు. అయితే పోలీసులు అన్ని సందర్భాల్లోనూ ఒకేలా ఉండరనే విషయాన్ని గుర్తించాలి. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. తాజాగా తెలంగాణ పోలీస్‌కు (Telangana Police) సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూశాక పోలీస్ అంటే భయం కన్నా వారి పట్ల గౌరవం పెరుగుతుందనడంలో సందేహం అక్కర్లేదు.
ఆ వీడియోను (Viral Video) గమనిస్తే... ఓ మూల మలుపు వద్ద కారు సడెన్‌గా ఆగిపోయింది. కారు నుంచి కిందకు దిగిన వ్యక్తి.. బానెట్ ఓపెన్ చేసి లోపల పరిశీలించాడు. ఆ తర్వాత అతని భార్య, బిడ్డ కూడా కిందకు దిగి ఏమైందని ఆరా తీశారు. కారులో ఏదో సమస్య వచ్చిందని... కాస్త ముందుకు నెడితేనే స్టార్ట్ అవుతుందని వారితో చెప్పాడు. ఇంతలో దారిన పోయే ఒకరిద్దరినీ సాయం చేయాల్సిందిగా కోరాడు. అందుకు వారు నిరాకరించడంతో... ఇక చేసేది లేక అతని భార్య, బిడ్డ కారును తోయడం మొదలుపెట్టారు.
ఇంతలోనే మరో ఇద్దరు చిన్నారులు వారికి తోడయ్యారు. నలుగురు కలిసి కారును ముందుకు నెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో బైక్‌పై అటుగా వెళ్తున్న ఇద్దరు పోలీసులు ఆ సీన్‌ను గమనించారు. వెంటనే బైక్‌ను పక్కన పార్క్ చేసి కారు వద్దకు వెళ్లి ఏమైందని అడిగారు. ఆపై అతని భార్య, బిడ్డను కారులో ఎక్కమని చెప్పి... అతన్ని వెళ్లి కారు స్టార్ట్ చేయమన్నారు. ఇద్దరు పోలీసులు వెనుక నుంచి కారును నెట్టడంతో... కారు వెంటనే స్టార్ట్ అయింది. దీంతో ఆ దంపతులు పోలీసులకు (Telangana Police) కృతజ్ఞతలు తెలియజేశారు. చివరలో ఆ పాప పోలీసులకు చాక్లెట్ ఇవ్వడంతో చిన్నారిని వారు ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు.
తెలంగాణ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయడంతో వైరల్‌గా (Viral Video) మారింది. 'ఎవరు ముందుకొచ్చినా.. రాకపోయినా... సమస్య కంటబడ్డ మరుక్షణం మీ సహాయార్థం వాలిపోయే వాడొకడుంటాడు... వాడే ఖాకీ...' అని పేర్కొంటూ తెలంగాణ పోలీస్ తమ ట్విట్టర్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేశారు. పోలీసులు చేసిన ఈ సాయాన్ని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.
Also Read: KGF 2 Movie: కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్‌కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి