12 BRS MLAS Joins Congress: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి..?..
12 BRS MLAS Joins Congress:తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి భారీఎత్తున వలసలు కాంగ్రెస్ లోకి కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Telangana Politics 12 BRS Mlas Meet CM Revanth Reddy Likely Joining In Congress: తెలంగాణ రాజకీయాలు సమ్మర్ లో మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు, లోక్ సభకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... దేశంలో రాజకీయాల్లో తెలంగాణ పొలిటిక్స్ పెనుసంచలనంగా మారింది. ఇప్పటికే ఒకవైపు లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్టు అయి ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో.. కాంగ్రెస్ నేతలు దీని వెనుక కేసీఆర్, కేటీఆర్ లు ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు మధ్య గొడవ పీక్స్ కు చేరింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వరుసగా నేతలు క్యూలు కడున్నారు.
బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీలోనే పెను దుమారం చెలరేగింది. కడియం శ్రీహరి,కడియం కావ్య, కేకేశవరావు, గద్వాల విజయలక్ష్మి, పట్నం మహేందర్ రెడ్డి వంటి కీలక నేతలు బీఆర్ఎస్ లోకి చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లోకి చేరిన బీఆర్ఎస్ నేతలను, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా.. తమ పదవికి రాజీనామాలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో.. బీఆర్ఎస్ నుంచి ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ 12 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నేతలు, సీఎం కేసీఆర్ తో టచ్ లోనే ఉన్నట్లు సమాచారం. ఈనెల 6 న కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో జనజాతర పేరిట సభ నిర్వహిస్తుంది. ఈ సభకు కాంగ్రెస్ హైకమాండ్ అంతా హజరవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ తోపాటు, సోనియా గాంధీ, మల్లీకార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రానున్నట్లు సమాచారం. ఈ సభలోనే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుముంటున్నాయి.
ఈ లిస్ట్ లో ఉన్న నేతలు...
తెల్లం వెంకట్రావ్ భద్రాచలం, సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్, కాలేరు వెంకటేశ్ అంబర్ పేట్, కాలే యాదయ్య చెవెళ్ల, అరికపూడీ గాంధీ శేర్ లింగంపల్లి,మాగంటీగోపీనాథ్ జుబ్లీహీల్స్, ప్రకాశ్ గౌడ్ రాజేంద్రనగర్, ముఠాగోపాల్ ముషిరాబాద్, మానిక్ రావ్ జహీరాబాద్, కోవాలక్ష్మి అసిఫాబాద్, బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్, అదే విధంగా కరీంనగర్ కుచెందిన కీలక నేత గంగుల కమలాకర్ కూడా కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. ఆయనకు కరీంనగర్ ఎంపీ సీటు కూడా కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ 12 మంది నేతలు మాత్రం కాంగ్రెస్ లోకి చేరితే, బీఆర్ఎస్ కు పెద్దకుదుపే అని చెప్పవచ్చు.
Read More: Snake Viral Video: ఇదేంది రా నాయన.. పాముతో లిప్ లాక్.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook