BRS MP Ranjith reddy And MLA Danam Nagender Joined In congress:  బీఆర్ఎస్ కు తెలంగాణలో ఊహించని ట్విస్టులు తగులుతున్నాయి. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్లను ఈడీ అరెస్టు చేసి ఢిల్లీకి తరలించింది. అంతేకాకుండా ఢిల్లీ కోర్టుకూడా కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఇక మరోవైపు ఒక పెద్దా హైడ్రామా మధ్య కవితను , ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లారు. దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది పూర్తిగా.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ లు కలిసి ఆడుతున్న నాటకాలు అంటూ ఎద్దేవా చేస్తున్నాయి. ఇక మరోవైపు దేశంలో సార్వత్రిక ఎన్నికల నగార మోగింది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ కు ఊహించని కష్టాలు మొదలయ్యరు. బీఆర్ఎస్ నుంచి వరుసగా.. ఇతర పార్టీలలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుసగా క్యూలు కడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..


తాజాగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతబాద్ ఎమ్మెల్యే  దానం నాగేందర్ కాంగ్రెలో పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ దీపదాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నగరా మోగిన తర్వాత సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఈరోజు ఉదయమే కాంగ్రెస్ పార్టీలోకి గెట్లు తెరిచామన్నారు.


అంతే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ వందరోజుల పాలనలో.. ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. మాజీ సీఎం కేసీఆర్, కడియం శ్రీహరిలాంటి వారు కూడా ప్రభుత్వాన్నికూడా కూల్చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ శ్రేణులు పదే పదే పడగొడతామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇది వింటూ చేతులు కట్టుకుని కూర్చోవాలా..?.. కుక్క కాటుకు చెప్పుదెబ్బ ఎలా ఉంటుదో చూపిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


Read More: Cat Falls In Toxic Tank: ఆ పిల్లిని టచ్ చేస్తే చచ్చిపోతారు.. నగరమంతా హై అలర్ట్.. కారణం ఏంటంటే..?


కాంగ్రెస్ పాలన వందరోజులు పూర్తయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఇక ముందు నిజమైన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలా ఉంటాడో ఇక మీదట చూపిస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook