Telangana Politics: ఎవరూ ఊహించనట్లుగా కేసీఆర్ దాదాపు తొమ్మిదిన్నర యేళ్లు పాలించారు. ఈ కాలంలో బీఆర్ఎస్ పార్టీతో రాజకీయ సాన్నిహిత్యం ఉండి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్నత పదవులు అనుభవించిన వారే పార్టీనీ వీడుతుండం ఏంటా అని బీఆర్ఎస్ పార్టీలో నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. కేశవరావు, కడియం శ్రీహరి, పోచారం లాంటి దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేతలు బీఆర్ఎస్ ను ఎందుకు వీడుతున్నారు కారణాలేంటా అని ఆలోచనలో పడ్డారు. లోపం ఎక్కడుంది అధిష్టానం తీరా లేక నేతల స్వంత ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారా అని చర్చించుకుంటున్నారట. పార్టీ అధికారం కోల్పోయిన కొన్ని నెలల్లోనే ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు ఎందుకు ఏర్పాడ్డాయి అని పార్టీ అభిమానులు ఆవేదన చెందుతున్నారట.  తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఉద్యమకారులను దూరం చేసుకున్న కేసీఆర్ అప్పట్లో  పిలిచి మరీ పెద్ద పదవులను కట్టబెట్టిన నాయకులు సైతం పార్టీకీ దూరంగా వెళుతున్నారు. పార్టీ ఈ రోజు ఎదుర్కొంటున్న సవాళ్లకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరే కారణమని పొంత పార్టీ నేతలు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఉద్యమ సమయంలో  టీఆర్ఎస్ పాత్ర ఎనలేనిది అదీ అందరూ ఒప్పుకోలేని నిజం. ఎంతో మంది ఉద్యమకారులు టీఆర్ఎస్ కు అండగా నిలబడ్డారు. తూటాలు,లాఠీలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధనలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కు రాజకీయంగా బలపడడానికి ఈ ఉద్యమకారులు బ్యాక్ బోన్ గా నిలిచారు. అలాంటి ఉద్యమకారులు ఇప్పుడు బీఆర్ఎస్ పై ఎందుకు అసంతృప్తితో ఉన్నారు. తమ కళ్ల ముందే పార్టీ ఇబ్బందుల పాలవుతున్న ఉద్యమకారులు ఎందుకు చూసీ చూడనట్లుగా ఉంటున్నారనే చర్చ బీఆర్ఎస్ లో జరుగుతుంది. పార్టీ పెట్టిన నాటి నుంచి  కేసీఆర్ ను నమ్ముకున్న చాలా మందికి అధికారంలోకి వచ్చాక మాత్రం కనీస గుర్తింపు దక్కలేదనే అభిప్రాయం మెజార్టీ ఉద్యమకారుల్లో ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడం అని  రాష్ట్రం వచ్చాక తమకు పదవులతో తగిన గుర్తింపు దక్కుతుందని నేతలు ఆశించారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అదేదీ జరగలేదు.


అంతకు ముందు వరకు  ఉన్న ఉద్యమ కేసీఆర్ కు ప్రభుత్వ అధినేతగా ఉన్న కేసీఆర్ కు చాలా మార్పు వచ్చిందని ఆయనతో  సన్నిహితంగా మెలిగిన మెజార్టీ నేతలే చెబుతుంటారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ తో గంటల పాటు వివద అంశాలపై చర్చించాము. తమ వ్యక్తిగత విషయాలను కూడా కేసీఆర్ తో చెప్పుకునేవారని గుర్తుచేసుకుంటున్నారు. అలాంటి కేసీఆర్ ఎప్పుడైతే సీఎంగా బాధ్యతలు స్వీకరించాడో పూర్తిగా మారిపోయారని చెబుతుంటారు. తెలంగాణ వచ్చిన కొత్తలో పాలనను గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే కలవలేకపోతున్నాడని అనుకునేవారము.  కానీ రోజులు గడుస్తున్నా అపాయింట్ మెంట్ దక్కక చాలా అసహనానాకి గురయ్యామని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన వారిని పార్టీలో చేర్చుకొని వారికి పదవులు కట్టబెట్టి అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. అంత వరకు ఆశపెట్టుకున్న ఎంతో మంది ఉద్యమకారులు, పార్టీ ప్రారంభం నాటి నుంచి ఉన్న నేతలు సైతం కేసీఆర్ ను ఏమీ అనలేక లోలోన భాధతో రగిలిపోయారు. ఇదే సందర్భంలో పార్టీలో రోజు రోజుకు ఉద్యమకారులకు, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారు సైడ్ అవుతూ వచ్చారు.


 ఇదే సమయంలో కొత్తగా చేరిన వారికి పార్టీలో ప్రాధాన్యత పెరగడంతో పాటు వారి పెత్తనం పెరుగుతూ వచ్చింది. దీనిని ఉద్యమకారులు తట్టుకోలేకపోయారు. అలాంటి వారిలో కొందరు వేరే పార్టీలో చేరగా మరి కొందరు మాత్రం బీఆర్ఎస్ లో ఉండీ ఉండనట్లు ఇన్ యాక్టివ్ గా మారారు. గత పదేళ్ల కాలంలో చాలా కొద్ది మంది ఉద్యమ కారులకు  మాత్రమే పార్టీలో గుర్తింపు వచ్చింది. చాలా మంది పార్టీపై అసంతృప్తితోనే  ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయాక అధినేత కేసీఆర్ ఒక్కొక్క ఉద్యమ నాయకుడిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో కొందరు కేసీఆర్ ను కలుస్తుండగా మరి కొందరు మాత్రం కేసీఆర్ కు అధికారం కోల్పోయాక ఇప్పుడు గుర్తుకు వచ్చామా అని అంటున్నారట. మేము మొదటి నుంచి పార్టీనీ , కేసీఆర్ ను నమ్ముకొని పని చేస్తే అధికారం వచ్చాక గుర్తింపు ఇవ్వలేక పోయారు.


పైగా ఇతర పార్టీ నుంచి తెలంగాణ వ్యతిరేకులను తెచ్చుకొని పార్టీలో అందలం ఎక్కించారు. అలాంటి వారు ఇప్పుడు పార్టీ వీడుతుండడంతో కేసీఆర్ కు తాము గుర్తుకు వచ్చామా అని ప్రశ్నిస్తున్నారట. దశాబ్దాల పాటు పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేస్తే తమకు గుర్తింపు దక్కలేనప్పుడు ఎందుకు పార్టీ కోసం ఆలోచించాలని కుండబద్దలు కొడుతున్నారట.పార్టీలో మొదటి నుంచి ఉన్న వారి పరిస్థితి ఇదైతే..
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరి పదవులు పొందిన వారి పరిస్తితి మరో రకంగా ఉంది. కేసీఆర్ తన పార్టీ అవసరాల కోసం తమను పార్టీలో చేర్చుకున్నాడే తప్పా తమ మీద ప్రత్యేక ప్రేమ ఏమీ లేదని వారు చెబుతున్నారు. పేరుకే పదవులు కానీ అధికారం మొత్తం కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉంది కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. పార్టీకీ మా అవసరం ఉంది కాబట్టే కేసీఆర్ చేర్చుకున్నాడు తప్పా మరో విషయం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇలా కేసీఆర్ పరిస్తితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ఇటు ఉద్యమకారులను దూరం చేసుకొని మరోవైపు వలస నేతలు పార్టీకీ ఒక్కొక్కరుగా బై బై చెబుతున్నా దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు గుర్తింపు ఇచ్చి ఉంటే ఇలాంటి సంక్షోభ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేది విశ్లేషకుల అభిప్రాయం.ఇక నైనా కేసీఆర్ ఉద్యమకారులతో చర్చించి వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారా లేక పోయే వాళ్లు ఎలాగో వెళుతున్నారు వదిలేస్తారా వేచి చూడాలి.


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter