Bathukamma Festival: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు.. ఎంగిలపూల బతుకమ్మతో ప్రారంభం..
Bathukamma Festival: నేటి నుంచి తెలంగాణలో అతిపెద్దదైన బతుకమ్మ పండగ జరుపుకోనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పూల సంబురం షురూ కానుంది. స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడంతో అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
Bathukamma Festival: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా బతుకమ్మ పండగ సందడి మొదలైంది. పూలతో బతుకమ్మను పేర్చేందుకు ఆడబిడ్డలు సిద్ధమవుతున్నారు. పల్లెల్లో పూసిన గునుగు, తంగేడు, బంతి, సీతమ్మజెడ పూలను పట్నాలకు వ్యాపారులు తరలిస్తున్నారు. ఇక రోజూ ఊరూవాడ ఉయ్యాల పాటలు హోరెత్తనున్నాయి. తీరొక్క పూలను తెచ్చి, పేర్చి ఆడబిడ్డలు ఎంతో ఉల్లాసంగా బతుకమ్మ ఆడనున్నారు. భాద్రపద బహుళ పంచమి మొదలుకుని మహాలయ అమావాస్య వరకు ఆడబిడ్డలు బొడ్డెమ్మలు ఆడతారు. అనంతరం బతుకమ్మ పండుగ మొదలవుతుంది. భాద్రపద బహుళ అమావాస్య (పెతన అమాస) నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమై సద్దుల బతుకమ్మతో సంపూర్ణం అవుతాయి. ఈ 9 రోజులు భక్తిశ్రద్ధలతో 9 రకాలుగా బతుకమ్మలను పేర్చి అమ్మవారికి నైవేద్యాలను సమర్పిస్తారు.
మొదటి రోజు అయిన ఇవాళ ఎంగిలిపువ్వు బతుకమ్మతో సంబరాలు షురూ అవుతాయి. రెండో రోజు.. అటుకుల బతుకమ్మ, మూడో రోజు.. ముద్ద పప్పు బతుకమ్మ, ఇక నాలుగో రోజు.. బియ్యం బతుకమ్మను నిర్వహిస్తారు. ఐదో రోజు.. అట్ల బతుకమ్మ, ఆరో రోజు.. అలిగిన బతుకమ్మ. ఇక 7ఏడో రోజు.. వేపకాయ బతుకమ్మను పేరుస్తారు. ఎనిమిదో రోజు.. వెన్నముద్దల బతుకమ్మను చేపడుతారు. ఇక తొమ్మిదో రోజు… సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. అలిగిన బతుకమ్మ రోజు మాత్రం అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించరు. పూలతో పేర్చిన బతుకమ్మలను అందుబాటులో ఉన్న చెరువుల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
కాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ సీఎం రేవంత్‌రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. బతుకమ్మ పండుగను అందరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని గౌరమ్మను సీఎం రేవంత్ ప్రార్థించారు. అటు BRS నేతలు కూడా ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమన్నారు.
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.