Holiday for schools, colleges and offices in Telangana: హైదరాబాద్: గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న కుంభవృష్టికి నగరం మొత్తం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నేడు, రేపు కూడా భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సెలవు దినంగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ సోమవారం రాత్రే ఆదేశాలు జారీ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, రెవిన్యూ, పోలీసు శాఖ, ఫైర్ సర్వీసు, మునిసిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ లాంటి అత్యవసర సేవల విభాగాల సిబ్బంది (Emergency services) మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాల్సిందిగా సర్కారు స్పష్టంచేసింది.


Also read : Cyclone Gulab live updates: తెలంగాణలో భారీ వర్షాలు.. నేడు, రేపు భారీ వర్షాలతో GHMC High alert


హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 30న జరగాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (PE CET) అక్టోబరు 23కి వాయిదా వేస్తున్నట్టు పీఈ సెట్ కన్వీనర్ స్పష్టంచేశారు. అంతేకాకుండా షెడ్యూల్ ప్రకారం నేడు జరగాల్సి ఉన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సబ్ కమిటీ సమావేశం కూడా వాయిదా పడింది.


గులాబ్ తుపాను ప్రభావంతో (Cyclone Gulab live updates) ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తుపాను తీరం దాటిన తర్వాత తుపాన్ ప్రభావం ఏపీ కంటే తెలంగాణపైనే అధికంగా కనిపిస్తోంది.


Also read : Bypolls Schedule: హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook