Cyclone Gulab live updates: తెలంగాణలో భారీ వర్షాలు.. నేడు, రేపు భారీ వర్షాలతో GHMC High alert

Cyclone Gulab live updates, Heavy rain in Telangana: నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హై అలర్ట్ (GHMC) ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాల‌ని సూచించిన జీహెచ్ఎంసీ.. మునిసిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

Last Updated : Sep 27, 2021, 12:10 PM IST
  • హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం (Heavy rain).
  • గులాబ్ తుపాను (Cyclone Gulab) ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు.
  • నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అప్రమత్తమైన GHMC
Cyclone Gulab live updates: తెలంగాణలో భారీ వర్షాలు.. నేడు, రేపు భారీ వర్షాలతో GHMC High alert

Cyclone Gulab live updates, Heavy rain in Telangana: హైదరాబాద్: గులాబ్ తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైద‌రాబాద్‌లో బంజారా హిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‎పేట్, ఎస్.ఆర్. నగర్, కూకట్‌‎పల్లి, బాలానగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, మేడిపల్లి, చెంగిచెర్ల, బోడుప్పల్‌, ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, కాచిగూడ, నల్లకుంట, దిల్‌‌షుఖ్‌‌న‌గ‌ర్‌, హయత్‌నగర్‌, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వ‌ర్షం (Heavy rainfall) కురుస్తోంది.

నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాల‌ని సూచించిన ప్రభుత్వం.. మునిసిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఇప్పటికే నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జ‌లమ‌య‌మ‌య్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ పూర్తిగా జలమయం అవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. 

Also read : Cyclone Gulab live updates: కళింగపట్నం సమీపంలో తీరం దాటిన గులాబ్ తుపాను

హైదరాబాద్‌ భారీ వర్షం (Heavy rain in Hyderabad) కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ కంట్రోల్‌ రూమ్ నంబ‌రు 040-23202813 కు (GHMC helpline number)ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. 

ఒక వైపు భారీ వ‌ర్షాలు, మరోవైపు భారత్ బంద్‌తో (Bharat Bandh live updates) గందరగోళం నెలకొనడంతో జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో నేడు జరగాల్సి ఉన్న పరీక్షలు వాయిదా ప‌డ్డాయి.

Also read : AP Heavy Rains Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, అతి భారీ వర్షాల హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News