New Ration Card Application Form: కొత్త రేషన్ కార్డులకు లైన్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
How to Apply for Ration Card in Telangana Online: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.
How to Apply for Ration Card in Telangana Online: కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో లబ్ధిదారుల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి అప్లికేషన్స్ స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజా పాలనలో భాగంగా ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లికేషన్స్ తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.
అర్హులైన వారందరూ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అర్హులైన వారు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అప్లికేషన్స్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్హత ఉన్న వారు రేషన్ కార్డు కోసం స్థానిక మీ సేవా కేంద్రాలలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభయహస్తంతో సంబంధం లేకుండానే కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉండగా.. వీటి ద్వారా 2.86 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం రేషన్ కార్డులకు సంబంధించినవే ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు, ఇతర రిక్వెస్టులు కలిపి 19,92,747 దరఖాస్తులు ఉన్నాయి. మిగిలిన 1,05,91,636 దరఖాస్తులు ఐదు గ్యారంటీలకు సంబంధించినవి ఉన్నాయి. గతంలో మాదిరిగానే మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (NIC) ద్వారా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు సమాచారం. రేషన కార్డులు ప్రజలకు అత్యంత ప్రధానం కావడంతో సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. Also Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?
Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook