Corona in Telangana: తెలంగాణలో కొత్తగా 2,700 మందికి కొవిడ్- 20 వేల పైకి యాక్టివ్ కేసులు
Corona in Telangana: తెలంగాణలో కరోనా కేసులు స్తిరంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్క రోజులో 2 వేల 7 వందలకు పైగా కేసులు నమోదయ్యాయి.
Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 2,707 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం గురువారం వెల్లడించింది. మొత్తం 84,280 టెస్టులకుగానూ.. ఈ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 7,02,801కు చేరింది.
మొత్తం కేసుల్లో ఎక్కువ భాగం ఒక్క హైదరాబాద్‌లోనే నమోదయ్యాయని ఆరోగ్య విభాగం పేర్కొంది.
బుధవారం సాయంత్రం 5:30 నుంచి గురువారం సాయంత్రం ఐదున్నర వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం వివరించింది.
రాష్ట్రంలో కరోనా మృతులు ఇలా..
రాష్ట్రంలో కొవిడ్ కారణంగా తాజాగా మరో ఇద్దరు మృతి చెందారు. దీనితో మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య 4,049కు చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు 0.57 శాతంగా ఉంది.
ఇక గడిచిన 24 గంటల్లో 582 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,78,290 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.51 శాతంగా ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 20,462 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,04,52,039 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది.
ప్రతి పది లక్షల మందికి గానూ.. 8,18,163 పరీక్షలు చేసినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. ఇంకా 10,026 శాంపిళ్ల పరీక్షా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని వివరించింది.
Also read: Murder case: తల మాత్రమే దొరికిన హ్యత్య కేసులో పురోగతి- తుర్కయాంజల్‌లో మొండెం లభ్యం!
Also read: Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ డెడ్‌లైన్... ఆలోపు హామీలను నెరవేర్చకపోతే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook