Telangana COVID-19 Positive Cases: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులు కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో 1300 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 1,321 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,140కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో శనివారం రాత్రి 8 గంటల వరకు 62,973 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో 13 వందల ఇరవై ఒకటి మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 12 వేల నూట నలభైకి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో అయిదుగురు వ్యక్తులు చనిపోయారు. తాజా మరణాలతో కలిపితే తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,717కి చేరింది.


Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి, సులువైన విధానం


గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరుగుతోంది. శనివారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19 నుంచి 293 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,02,500 మంది కరోనా మహమ్మారిని జయించారు. 


Also Read: COVID-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకా తీసుకుని రక్తం గడ్డకట్టడంతో ఏడుగురు మృతి


జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత అధికం అవుతుంది. కోవిడ్-19(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC)లోనే ఏకంగా 320 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా సెకండ్ సేవ్ కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైనా ఫలితం కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 3,886 మంది చికిత్స పొందుతున్నారు.


Also Read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా, అయితే ఇడ్లీని Breakfastగా తీసుకోవచ్చా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook