Bengumpet Police Cheating Girl: సమాజంలో మహిళల భద్రత పెనుసవాల్ గా మారింది. ప్రభుత్వాలు మహిళల భద్రతకు కఠిన చట్టాలు తీసుకొచ్చిన కేటుగాళ్లలో మాత్రం మార్పు రావడంలేదు. ప్రతిరోజు యువతులపై అఘాయిత్యాల ఘటనలు వార్తల్లో ఉంటాయి. గుడి, బడి, ఇల్లు అని తేడాలేకుండా ప్రతిచోట యువతులు వేధింపులు బలౌతున్నారు. కొన్ని చోట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వరుసలు మర్చిపోయి నీచంగా ప్రవర్తిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Anchor Anasuya: ఏం అందం మావ.. వెకేషన్ పిక్స్‌తో పిచ్చెక్కించిన అనసూయ..!


ఇక ఇలాంటి ఘోరాలకు బాధితులైన అమ్మాయిలు పోలీసుస్టేషన్ కు వెళ్లి తమగొడును చెప్పుకుంటారు. అక్కడ కూడా .. కొందరు పోలీసులు నక్కల మాదిరిగా బాధితులను వేధిస్తున్నారు. కొందరు పోలీసులు ఇలాంటి పనులు చేయడం వల్ల డిపార్ట్ మెంట్ అంతటికి చెడ్డ పేరు వస్తుంది. ప్రస్తుతం ఈ ఒక ఖాకీచకుడి ఘనకార్యం వార్తలలో నిలిచింది. 


పూర్తి వివరాలు...


ఇటీవల కామారెడ్డికి బదిలీ అయిన  అరుణ్ అనే ఎస్సై చేసిన ఘనకార్యం ఆలస్యంగా బయటపడింది. ఇతగాడు.. గతంలో.. సిద్ధిపేట పోలీసు కమిషరేట్ పరిధిలో ఉన్న బేగంపేట్ పోలీసు స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వర్తించాడు. ఈ సమయంలో ఒక యువతి ఒక కేసు విషయమై స్టేషన్ కు వచ్చింది. అప్పుడు ఆమెతోపరిచయం పెంచుకున్నాడు. తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ, యువతిని ముగ్గులోకి దింపాడు.


మాయమాటలు చెప్పి, యువతిని పెళ్లిపేరుతో లొంగ దీసుకున్నాడు. ఇంటికి పిలిచి అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాధితురాలు తప్పించుకుని ఉన్నతాధికారులకు ఇతగాడి బండారం మొత్తం చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అరుణ్ ను అరెస్టు చేశారు.


Read More: Foamy Urine Causes: మూత్రంలో నురుగు వస్తే తస్మాత్‌ జాగ్రత్త..ఎందుకంటే!


ఇతగాడి ఖాతాలో చాలా మంది బాధితయువతులు ఉన్నారని పోలీసులు దర్యాప్తులో తెలింది. ఇలాంటి వారిని సర్వీస్ నుంచి తొలగించి కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా మహిళ సంఘాలు, బాధిత యువతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మాత్రం తీవ్ర దుమారం రేపింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook