హైదరాబాద్: ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోన్న కరోనా వైరస్‌పై తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (శనివారం) కరోనా వైరస్ పై నియంత్రణ ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. వైరస్‌ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా కేబినెట్ సమావేశానంతరం కేబినెట్ నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనున్నారు. కరోనా వైరస్ రాష్ట్రంలో తీవ్రంగా ప్రబలకపోయినా...ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు కరోనా వైరస్ సోకిందని, వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒక రోగిని డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. మరో పేషెంట్ (ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి)కి పాజిటవ్ తేలడం, మరో ఇద్దరికి లక్షణాలున్నాయని తేలడంతో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది.


దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శాసనసభలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం విపత్కరమైన పరిస్థితుల్ల మద్య సర్కారు తీసుకొనే నిర్ణయాలను కట్టుబడి ఉండాల్సి ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు పుట్టిన రోజు వేడుకలు, వివాహ వేడుకలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని, జనసమూహం అధికంగా ఉన్న చోట ఎక్కువగా ఉంటే..వైరస్  ఎక్కువగా వ్యాపిస్తుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..