SEC Released Gazette Notification With Names Of Corporators In GHMC: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(GHMC) కొత్త కార్పొరేటర్లకు నెల రోజుల తరువాత ఆమోద ముద్ర పడింది. గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన 150 మంది కార్పొరేటర్ల పేర్లతో తెలంగాణ ఎన్నికల సంఘం గెజిట్‌ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గం ఏర్పాటులో మరో అడుగు ముందుకు పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గత ఏడాది డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించగా డిసెంబర్ 4న ఫలితాలు ప్రకటించారు. అయితే నేటికి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ప్రక్రియ జరగలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం గడువు ముగిసిన వెంటనే కొత్త పాలకవర్గం ఏర్పాటుకు, తొలి సమావేశానికి నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు జీహెచ్ఎంసీ(GHMC) ప్రస్తుత సభ్యులే విధులు నిర్వహించనున్నారు.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. త్వరలో కీలక ప్రకటన



జీహెచ్ఎంసీ కొత్త కార్పొరేటర్ల పేర్లతో గెజిట్‌ జారీ అయిన నెల రోజుల్లోపే నూతన పాలకవర్గం తొలి సమావేశం జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 16 లోగా GHMC నూతన పాలకవర్గం కొలువుదీరాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, పాలక మండలి ఏర్పాటు నేపథ్యంలో ఎక్స్-అఫీషియో సభ్యుల జాబితాపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. 


Also Read: WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్


 


కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. టీఆర్ఎస్(TRS) పార్టీకి 56, బీజేపీకి 48, ఎంఐఎంకు 44 స్థానాలు రాగా, రెండు స్థానాల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కార్పొరేటర్లుగా విజయం సాధించారు.


Also Read: Coronavirus Telangana: కొత్తగా 299 కరోనా కేసులు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook