Speaker Pocharam tested Corona Positive : తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas reddy)కి కొవిడ్ పాజిటివ్(Covid-19 Positive)గా తేలింది. నిన్న రాత్రి సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్న స్పీకర్‌కు కరోనాగా నిర్ధారణ అయ్యింది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: TS COVID-19 cases: తెలంగాణలో కరోనా కేసులపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్


గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కొవిడ్ పరీక్షలు(Corona tests)చేయించుకోవాలని...తగు జాగ్రత్తలతో హోం ఐసోలేషన్​లో ఉండాలని పోచారం కోరారు. ఇటీవలే శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు(Corona Cases in telangana)పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, అధికారులు కూడా కొవిడ్ బారిన పడుతున్నారు. మూడో దశ ముప్పు ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook