హైదరాబాద్: కరోనావైరస్ కట్టడికి లాక్‌డౌన్ విధించగా.. ఆ లాక్‌డౌన్‌ని ఎప్పుడు ఎత్తివేస్తారో స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి లేనందున తెలంగాణలో నిర్వహించబోయే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ 2020 ( Telangana SSC exams 2020 ) విషయంలో తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షల కోసం మార్చి నెలలో విడుదల చేసిన హాల్ టికెట్స్‌తోనే ( TS SSC exams 2020 Admit cards) లాక్ డౌన్ తర్వాత పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు నిర్ణయించుకున్నట్టు బోర్డు డైరెక్టర్ ఎ సత్యనారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు. కొత్తగా హాల్ టికెట్స్ (  SSC Hall tickets) జారీ చేయడం లేదని.. పాత అడ్మిట్ కార్డ్స్‌తోనే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు ఉత్తర్వులు సైతం వెలువడినట్టు సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Vizianagaram : విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం


కరోనావైరస్ నివారణ చర్యల్లో భాగంగా పరీక్షల నిర్వహణలోనూ సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing ) లక్ష్యం దెబ్బతినకుండా బెంచ్‌కి ఒకరే కూర్చోవాలనే నిబంధన విధించారు. అదే సమయంలో బెంచ్‌కి ఒకరినే కేటాయించే క్రమంలో మళ్లీ పరీక్షా కేంద్రాలను కూడా పెంచాల్సి వస్తోందని.. అయితే కొత్తగా ఏర్పాటయ్యే పరీక్షా కేంద్రాలు ఏవైనా.. ప్రస్తుతం కేటాయించిన కేంద్రానికి సమీపంలోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు సత్యనారాయణ రెడ్డి స్పష్టంచేశారు. 


Also read : తెలంగాణలో Coronavirus లేటెస్ట్ అప్‌డేట్స్


కొత్తగా పెరగనున్న ఎగ్జామ్ సెంటర్స్ కారణంగా ఇన్విజిలేటర్స్, ఇతర సిబ్బందిని కూడా పెంచాల్సిన అవసరం ఏర్పడినట్టు బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. కరోనాను కట్టడి చేయగలిగితే మే నెలలోనే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. కానీ కరోనా వ్యాప్తి పరీక్షలను వాయిదా వేయాలన్న హైకోర్టు ఆదేశాలు ( TS High court orders on SSC 2020 exams ) అమలులో ఉన్న నేపథ్యంలో.. కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. 


ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మీడియా సమావేశంలో ( CM KCR press meet ) మాట్లాడుతూ.. హై కోర్టు నుంచి అనుమతి తీసుకుని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ గతంలో మధ్యలో ఆగిపోయిన ఎస్ఎస్సీ పరీక్షలను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..