TS SSC Results 2021: తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ జీవో జారీ
Telangana SSC Results 2021: హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ జీవో జారీ అయింది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విద్యార్థులందరినీ పాస్ చేస్తూ జీవో జారీ చేసింది. FA మార్కుల (Formative assessment marks) ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ వెల్లడించింది.
Telangana SSC Results 2021: హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ జీవో జారీ అయింది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విద్యార్థులందరినీ పాస్ చేస్తూ జీవో జారీ చేసింది. FA మార్కుల (Formative assessment marks) ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ వెల్లడించింది. ఎస్ఎస్సీ ఫలితాలపై సంతృప్తి కలగని వారికి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఇస్తామని ప్రభుత్వం ఈ జీవోలో పేర్కొంది.
Also read : ఎవరెవరికి e-Pass తప్పనిసరి, ఎవరు ఇస్తారు ?.. క్లారిటీ ఇచ్చిన DGP మహేందర్ రెడ్డి
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో 10వ తరగతి (TS SSC Results 2021), ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తున్నట్లు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పరీక్షలు లేకుండానే టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. జూన్ రెండో వారం నాటికి పరిస్థితిని సమీక్షించి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేసింది.
ఇదిలావుంటే, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ నేటి నుంచే అమలులోకి రానుంది. నేటి నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ అమలు ఉండనుంది. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 వరకు లాక్‌డౌన్ (Lockdown in Telangana) నుంచి మినహాయింపు ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook