జర్నలిస్టులను ఆదుకోవాలి..!!
`కరోనా వైరస్` మహమ్మారితో ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వారిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులతోపాటు కరోనా వారియర్స్ జాబితాలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ కు సంబంధించిన వార్తలను సేకరిస్తూ నిత్యం ప్రజలకు వార్తలను చేరవేస్తున్నారు.
'కరోనా వైరస్' మహమ్మారితో ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వారిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులతోపాటు కరోనా వారియర్స్ జాబితాలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ కు సంబంధించిన వార్తలను సేకరిస్తూ నిత్యం ప్రజలకు వార్తలను చేరవేస్తున్నారు.
ఈ క్రమంలో జర్నలిస్టులు కూడా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే కొంత మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకింది. ఐతే దీనిపై ఇప్పుడు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కరోనాపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య హైకోర్టులో వాదనలు వినిపించారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని కోర్టుకు విన్నవించారు.
లాక్ డౌన్ కారణంగా జర్నలిస్టులు ఆర్ధికంగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. కాబట్టి తెలంగాణవ్యాప్తంగా ఉన్నప్రతి జర్నలిస్టుకు 25 వేల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. అంతే కాకుండా ప్రతి జర్నలిస్టుకు ఆరోగ్య బీమా కల్పించాలని తెలిపారు. జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు ఉచితంగా అందించేలా ఏర్పాటు చేయాలన్నారు.
పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం తెలంగాణ ప్రధాన కార్యదర్శి, సమాచార, పౌర సంబంధాల శాఖతోపాటు ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానానికి తెలిపారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను కోర్టు 2 వారాలకు వాయిదా వేసింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..