తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి.  ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి  ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్ లో 59.8 శాతం సెకండియర్ లో 65శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్‌ ఫస్టియర్ లో 76శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ జిల్లా టాప్ ప్లేస్ లో నిలబడింది.  రంగారెడ్డి జిల్లా 71శాతంతో సెకండ్ ప్లేస్ లో ఉంది . 29 శాతం ఉత్తీర్ణతతో మెదక్‌ జిల్లా చిట్ట చివరి స్థానంలో నిలిచింది. 


ఇక సెకండియర్ ఉత్తీర్ణత విషయానికి వస్తే 76 శాతంతో  మేడ్చల్‌ టాప్ ప్లేస్ నిలవగా.. 75 శాతంతో కొమ్రంభీం జిల్లా   రెండో స్థానంలో నిలిచింది, మెదక్‌ జిల్లా 34 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.


ఫలితాల కోసం ఈ లింక్స్ లో ఏదో ఒకటి క్లిక్ చేయండి: results.cgg.gov.in (లేదా) examresults.net