Dr Gadala Srinivas Rao: బిఆర్ఎస్ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన డా శ్రీనివాస్ రావు
Dr. Gadala Srinivas Rao to Join BRS Party: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా గడల శ్రీనివాస రావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని.. రాజీనామా చేసిన వెంటనే ఖమ్మంలో జరగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభ వేదికపై నుంచే సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Dr. Gadala Srinivas Rao to Join BRS Party: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా గడల శ్రీనివాస రావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని.. రాజీనామా చేసిన వెంటనే ఖమ్మంలో జరగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభ వేదికపై నుంచే సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గడల శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆయనకు వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఇవ్వడం ఖాయం అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఆ ప్రచారం సారాంశం. కొత్తగూడెం టికెట్ తో పాటు అక్కడ గెలుపుపై డా గడల శ్రీనివాస్ ఎంతో నమ్మకంగా ఉన్నారని.. అందుకే ప్రస్తుతం చేస్తోన్న ఉద్యోగాన్ని సైతం వదులుకునేందుకు సిద్ధపడ్డారనే ప్రచారం జరుగుతోంది.
డా గడల శ్రీనివాస్ రావు రాజీనామా అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రచారంపై స్వయంగా ఆయనే స్పందించారు. తాను తన ఉద్యోగానికి రాజీనామ చేయడం లేదని.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చేపట్టబోతున్న కంటి వెలుగు కార్యక్రమం అమలు ఏర్పాట్లు పరిశీలించడంలో బిజీ బిజీగా ఉన్నాను అని డా గడల శ్రీనివాస్ రావు క్లారిటీ ఇచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. అలాంటి వదంతులు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అనవసరంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఉద్యోగం చేసుకుంటున్నానని, ఉద్యోగం విడిచి ఎక్కడికి వెళ్లడం లేదని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా గడల శ్రీనివాస రావు తేల్చిచెప్పారు.
ఇది కూడా చదవండి : BRS Khammam Meeting: ఖమ్మం బీఆర్ఎస్ సభ షెడ్యూల్.. హైదరాబాద్‌కి క్యూ కడుతున్న పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు
ఇది కూడా చదవండి : TS Teachers Transfers: సీఎం కేసీఆర్ సంక్రాంతి గిఫ్ట్.. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్
ఇది కూడా చదవండి : Vandebharat Express: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అధికారిక టైమింగ్స్, టికెట్ ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook