BRS Khammam Meeting: ఖమ్మం బీఆర్ఎస్ సభ షెడ్యూల్.. హైదరాబాద్‌కి క్యూ కడుతున్న పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు

BRS Khammam Meeting: మంగళవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకున్న జాతీయ స్థాయి నేతలంతా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిసి వారంతా యాదాద్రికి వెళ్లి అక్కడ కొత్తగా నిర్మించిన ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 06:34 AM IST
BRS Khammam Meeting: ఖమ్మం బీఆర్ఎస్ సభ షెడ్యూల్.. హైదరాబాద్‌కి క్యూ కడుతున్న పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు

BRS Khammam Meeting: ఖమ్మంలో బుధవారం బిఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రికి పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌కి మంత్రి మహమూద్‌ అలీ స్వాగతం పలుకుతారు. వారి ప్రొటోకాల్ మొత్తం మంత్రి మహమూద్ అలీ పర్యవేక్షిస్తారు. కేరళ సీఎం పినరయి విజయన్‌కి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, సీపీఐ జాతీయ నేత డి.రాజాకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్‌ స్వాగతం చెబుతారు. 

మంగళవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకున్న జాతీయ స్థాయి నేతలంతా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిసి వారంతా యాదాద్రికి వెళ్లి అక్కడ కొత్తగా నిర్మించిన ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. లక్ష్మినర్సింహ స్వామి దర్శనం అనంతరం యాదాద్రి నుంచి రెండు హెలీకాప్టర్లలో ఖమ్మంకు బయలుదేరి వెళ్తారు.

నేరుగా సీఎం కేసీఆర్‌‌తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్‌ చేరుకొని, రాష్ట్రంలో చేపట్టే 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఖమ్మం సభా వేదిక ముందు ప్రధాన నాయకులకు ప్రత్యేక సెక్టార్‌ ఉంటుంది. మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు సభావేదిక ముందు ఆసీనులవుతారు. సీఎం కేసీఆర్‌‌తో సభా వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలే ఉంటారు. తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల్లో కొత్త జోష్ నింపాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. 18వ తేదీ మ. 2 నుంచి సా. 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది. ఆ తరువాత అదే హెలీక్యాప్టర్లలో జాతీయ స్థాయి నేతలంతా సీఎం కేసీఆర్‌తో కలిసి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఎవరి గమ్యస్థానాలకు వారు తిరిగి వెళ్లిపోనున్నారు.

ఇది కూడా చదవండి : Dr Gadala Srinivas Rao: బిఆర్ఎస్ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన డా శ్రీనివాస్ రావు

ఇది కూడా చదవండి : TS Teachers Transfers: సీఎం కేసీఆర్ సంక్రాంతి గిఫ్ట్.. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్

ఇది కూడా చదవండి : Vandebharat Express: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అధికారిక టైమింగ్స్, టికెట్ ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News