TS Teachers Transfers: సీఎం కేసీఆర్ సంక్రాంతి గిఫ్ట్.. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్

TS Govt Green Signal For Teachers Transfers And Promotions: ఎన్నో రోజులుగా బదిలీలు, ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. టీచర్స్ ట్రాన్స్‌ఫర్స్, పదోన్నతులకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 9,266 మందికి ప్రమోషన్లు లభించనున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2023, 12:33 AM IST
  • మంత్రులతో చర్చించిన టీటీజేఏసీ నాయకులు
  • ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు సీఎం కేసీఆర్ ఒకే
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
TS Teachers Transfers: సీఎం కేసీఆర్ సంక్రాంతి గిఫ్ట్..  ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్

TS Govt Green Signal For Teachers Transfers And Promotions: తెలంగాణలో టీచర్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు సీఎం కేసీఆర్ ఒకే చెప్పారు. ఆదివారం మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, హరీష్ రావు, ఉన్నత అధికారులతో టీటీజేఏసీ నాయకులు సమావేశం అయ్యారు. పదోన్నతులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందజేసిందన్నారు. ఉపాధ్యాయులకు త్వరలో ప్రమోషన్స్, బదిలీలు ఇవ్వమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని.. అందుకు ప్రాసెస్ మొదలు అయిందని తెలిపారు. 9,266 మందికి ప్రమోషన్స్ ఇవ్వబోతున్నామని అన్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 

రెండు మూడు రోజుల్లో షెడ్యుల్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను మంత్రులు రూపొందిస్తున్నారు. మంత్రులతో భేటీలో తమ ఇబ్బందులు, సమస్యలను టీటీజేఏసీ నాయకులు వివరించారు. వీటన్నింటికి సానుకూలంగా స్పందించిన మంత్రులు.. సీఎం కేసీఆర్‌తో చర్చించిన అనంతరం పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయ సంఘాల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  

Also Read: SBI Loan Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు  

Also Read: విరాట్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన టీమిండియా.. 73 పరుగులకే  శ్రీలంక ఆలౌట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

Trending News