Telangana Talli Idol: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో పెత్తందారి పోకడలున్నాయని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తగా బహుజనుల రూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఇందులో తెలంగాణ తల్లికి ఎలాంటి ఆభరణాలు.. నెత్తిన కిరీటం లాంటివి లేవు.  చేతిలో బతుకమ్మ బదులు కంకులు.. ఇంకో చేయి కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం గుర్తుకు తెస్తుంది. ఈ కొత్త తెలంగాణ తల్లి విగ్రహంపై  కొంత మంది తెలంగాణ వాదులు ఆక్షేపిస్తున్నారు. మరికొందరు ఇదే బాగుందని చెప్పుకుంటున్నారు. ఎవరేమన్నా.. పట్టించుకోకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు.. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్నిసీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ  కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొంటారు.


రాష్ట్ర నలుమూలల నుంచి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి రమణారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌ సన్మానించారు. పోరాట స్ఫూర్తిని చాటేలా విగ్రహాన్ని తీర్చిదిద్దారని ఆయన్ను కొనియాడారు.


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.