TS TET 2022: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు అభ్యర్థులు భారీగా హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల దగ్గర ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. చంటి పిల్లలతో పరీక్షకు హాజరయ్యారు కొందరు అభ్యర్థులు. తల్లులేమో టెట్ పరీక్ష రాయడానికి లోపలికి వెళితే.. పసి బిడ్డలను బయట తండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ఆడించారు. కొన్ని కేంద్రాల దగ్గర చంటి బిడ్డతో పరీక్ష రాయడానికి వచ్చిన మహిళా అభ్యర్థులు కనిపించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెట్ పరీక్షకు నిమిషం నిబందన అమలు చేశారు. దీంతో చివరి నిమిషం వరకు ఉరుకులు పరుగులతో  పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు అభ్యర్థులు. కొన్ని కేంద్రాల దగ్గర అభ్యర్థులు లేట్ గా వచ్చారు. కూకట్ పల్లిశని శంశిగూడ ప్రభుత్వ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన సెంటర్ లో పరీక్షకు ఓ అభ్యర్థి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. లోపలికి పంపించాలని పోలీసులను వేడుకున్నారు. అడ్రస్ దొరకకపోవడంతో లేట్ అయిందని.. పరీక్షకు అనుమతి ఇవ్వాలని ప్రాదేయపడ్డారు. అయినా పోలీసులు కనికరించలేదు. దీంతో పరీక్ష కేంద్రం దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు టెట్ అభ్యర్థి.


తెలంగాణ వ్యాప్థంగా టెట్ పరీక్షకు మొత్తం 6 లక్షల29 వేల 352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌-1ను 3 లక్షల51 వేల 468 మంది, పేపర్ 2ను 2లక్షల77 వేల 884 మంది అభ్యర్థులు రాయనున్నారు. ఉదయం జరిగిన పేపర్‌-1 కోసం 1480 పరీక్షా కేంద్రాలు.. పేపర్‌-2కు 1203 సెంటర్లను ఏర్పాటు  చేశారు. మొత్తం 33 జిల్లాలకు కలిపి మొత్తం 2 వేల683 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.  అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లా నుంచి అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎగ్జామ్ సెంటర్లు కూడా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నాయి. తర్వాత స్థానంలో నల్గొండ జిల్లా ఉంది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తక్కువ పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. డీవోలు మినహా ఇతర సిబ్బంది, ఇన్విజిలేటర్లను విద్యాశాఖతో సంబంధం లేనివాళ్లను నియమించారు. అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలతో పాటు ఇతర మౌళిక సదుపాయాలు కల్పించారు. పరీక్ష నిర్వహణలో మాల్‌ ప్రాక్టిస్‌ అరికట్టడానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. టెట్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. 


Read also: Telangana Schools: తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు! క్లారిటీ ఇచ్చిన మంత్రి సబిత..  


Read also: Minor Gang Rape:బాలికను మొదట టచ్ చేసింది ఎమ్మెల్యే కొడుకే! గ్యాంగ్ రేప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.