TG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నేపధ్యంలో జూన్ 2వ తేదీ నాటికి టెట్ పరీక్షలు పూర్తయ్యాయి. తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన ప్రాధమిక కీ ఇప్పటికే విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TS TET 2024 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో మే 20 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2 లక్షల 86 వేల 381 దరఖాస్తులు రాగా, 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు. ఇందులో పేపర్ 1 కోసం 99,958 మంది, పేపర్ 2 కోసం 1,86,423 మంది అప్లై చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మెగా డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. 


తెలంగాణ టెట్ 2024 పరీక్ష ఫలితాలను https://tstet2024.aptonline.in/tstet/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. TS TET 2024 Results ఆప్షన్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చూడవచ్చు. టెట్ పరీక్ష ఒకసారి రాస్తే సరిపోతుంది. ఎప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడినా ఈ పరీక్ష అర్హత ఆధారంగా అప్లై చేసుకోవచ్చు. టెట్ పేపర్ 1లో ఉత్తీర్ణత చెందితే 1 నుంచి 5 వరకూ బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హత లభిస్తుంది. పేపర్ 2లో ఉత్తీర్ణత చెందితే 6 నుంచి 8 వరకూ బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. తెలంగాణలో జూలై నెలలో మెగా డీఎస్సీ జరగనుంది. 


తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 11,062 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో 2629 స్కూల్ అసిస్టెంట్, 6,508 ఎస్జీటీ  727 లాంగ్వేజ్ పండిట్స్, 182 పీఈటీ, 220 స్పెషల్ కేటగరీ స్కూల్ అసిస్టెంట్లు, 796 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి. 


Also read: Rainfall: హైదరాబాద్‌లో కుండపోత.. అత్యధిక వర్షపాతంతో నిండా మునిగిన ఆ ప్రాంతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook