Telangana Thalli Controversy: తెలంగాణ తల్లి ఫొటోను, రాష్ట్ర గీతం ను  టెక్స్ట్‌  బుక్స్‌ లో  ప్రింట్‌ చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పుస్తకాల్లో ఈ చేర్పులు చోటు చేసుకోనున్నాయి. త్వరలోనే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాల ప్రింట్‌  ప్రారంభం కానుంది. ఈ పుస్తకాల్లో రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’, ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన తెలంగాణ తల్లి ఫొటోను ప్రింట్‌ చేయాలని  నిర్ణయం తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం పుస్తకాల్లో ప్రతిజ్ఞతో పాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లయినా గత సర్కారు రాష్ట్ర గీతాన్ని అధికారంగా నిర్ణయించలేదు. ఏడాది కింద వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం.. ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. తాజాగా ఏడాది పాలన పూర్తయిన సందర్బంగా సెక్రటేరియెట్​లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో రాష్ట్ర గీతంతోపాటు  తెలంగాణ తల్లి ఫొటోను రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


వచ్చే 2025–26 విద్యా సంవత్సరంలోనూ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు బైలింగ్వల్ బుక్స్‌  ప్రింట్‌  చేయాలని  రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. మరో వైపు పుస్తకాలలోని సిలబస్ మార్పుపైనా విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. 2026- –27 విద్యా సంవత్సరంలో సిలబస్​ లో  మార్పులు చేయాలని నిర్ణయించింది. నేషనల్ కర్రికులమ్ ఫ్రేమ్ వర్క్ కు తగ్గట్టు రాష్ట్ర స్థాయిలోనూ పాఠ్యాంశాలను రూపకల్పన చేయనున్నారు. ఈ మేరకు  రాష్ట్రంలో ఉండే ప్రత్యేకతలు, చరిత్ర, సాంస్కృతిక అంశాలను చేర్చడంపై స్టడీ చేస్తున్నారు.


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.