TS Police Constable Recruitment: తెలంగాణలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను రేపటి నుంచి జారీ చేయనున్నారు. ఈనెల 28న రాత పరీక్ష జరగనుంది. ఈనేపథ్యంలో రేపటి నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఈనెల 26వ తేదీ వరకు హాల్‌ టికెట్లను పొందే అవకాశం ఉంది. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 15 వేల 644 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో ఈఏడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్‌ వచ్చింది. ఏప్రిల్ 28న మరో 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. 28న జరగనున్న కానిస్టేబుల్ పరీక్షలకు మొత్తం 16 వందల ఒక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయి. ఈపరీక్షకు 6 లక్షల 61 వేల 196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 


ఇటీవల పోలీస్‌ శాఖలో వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 90 వేల ఉద్యోగాలకు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో 10 వేల పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అప్పటి నుంచి 80 వేల పోస్టులకు వరుసగా నోటీఫికేషన్లు జారీ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్రత్యేకంగా పోలీసు బోర్డు ద్వారా రిక్రూట్‌మెంట్ పూర్తి చేస్తున్నారు.


Also read:CPEC: భారత సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు..చైనా సైనికుల మోహరింపు దేనికీ..?


Also read:CM Jagan Review: అంతా వైద్య కళాశాలల నుంచే..వైద్యారోగ్య శాఖలో కీలక సంస్కరణాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook