TS Group1 Posts Increases By 60: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో తనదైన మార్కు చూపిస్తుంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ శాఖలలో వినూత్న రీతిలో మార్పులు చెపట్టింది. గత ప్రభుత్వ హయాంలో నుంచి పెరుకుపోయిన అనేక సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. దీనిలో భాగంగానే.. ఇప్పటికే అనేక అధికారులకు స్థాన భ్రంశం కల్గించింది. అనేక శాఖలకు కొత్త బాసులను నియమించింది. ముఖ్యంగా సర్కారు కొలువు కోసం నిరుద్యోగులు ఎంతగానో కష్టపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Niharika Konidela: క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తోన్న నిహారిక.. లేటెస్ట్ పిక్స్ వైరల్..


గత బీఆర్ఎస్ పాలనలో గ్రూప్ 1 అనేక మార్లు లీక్ అయిన సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ పోలీసు బాస్ మహేందర్ రెడ్డిని నియమించారు.


మరికొందరు కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫికేషన్ లో ఎలాంటి లీకులు, కానీ సమస్యలు రాకుండా ఎగ్జామ్ లు పకట్భందిగా నిర్వహించడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి సర్కారు నిరుద్యోగుకలు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 1 పోస్టులను పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. గత సర్కారు కాలంలో 503పోస్టులతో గ్రూప్ 1 నోటిషికేషన్ ను జారీచేశారు.


Read More: Poori Receipe: పూరీలు గుల్లమాదిరిగా పొంగాలనుకుంటున్నారా..?.. అయితే.. ఈ సింపుల్ ప్రాసెస్ ను ఫాలో అయిపోండి..


కానీ అనేక మార్లు అది లేకుల సంఘటనలతో క్యాన్షిల్ అయ్యింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రేవంత్ ఇప్పటికే అనేక శాఖలలో ఉన్న ఖాళీల వివరాలు తెప్పించుకున్నారు. వచ్చే ఏడాదిలో కూడా రిటైర్ అయ్యే జాబితాను కూడా ఇప్పటికే తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తాజాగా, గ్రూప్ 1 లో  60 పోస్టులను కూడా కొత్తగా యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు తెలంగాణాలో గ్రూప్ 1 పోస్టులు ఖాళీలు 563 అన్నమాట. అదే విధంగా తొందరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ సర్కారు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. 
 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook