Poori Receipe: పూరీలు గుల్లమాదిరిగా పొంగాలనుకుంటున్నారా..?.. అయితే.. ఈ సింపుల్ ప్రాసెస్ ను ఫాలో అయిపోండి..

Kitchen Tips: చాలా మంది పూరీలను ఎంతో ఇష్టంతో తింటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పూరీలు ఎక్కువ మంది లాగించేస్తారు. కానీ పూరీలు అనేవి గుల్ల మాదిరిగా పొంగితే చూడటానికి ఎంతో బాగుంటుంది. అలా చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 5, 2024, 08:54 PM IST
  • - బ్రేక్ ఫాస్ట్ లో పూరీలు ఎక్కువ మంది తింటారు..
    - పూరీ పిండిని నానబెట్టేటప్పుడు కాసిన్ని నూనె చుక్కలు వేయాలి..
Poori Receipe: పూరీలు గుల్లమాదిరిగా పొంగాలనుకుంటున్నారా..?.. అయితే.. ఈ సింపుల్ ప్రాసెస్ ను ఫాలో అయిపోండి..

Step By Step Poori Making Process: పూరీలంటే చాలా మంది పడిచస్తుంటారు. అయితే.. కొందరు పూరీలు చేస్తే పొంగుతూ, చూడటానికి ఎంతో బాగుంటుంది. కానీ ఇంకొందరు మాత్రం పూరీలు మెత్తగా చేస్తుంటారు. ఆయిల్ గుమ్మరించినట్లుగా ఉంటుంది. అది పూరీనో లేదా చపాతితో అస్సలు అర్థంకాదు. అయితే.. పూరీలు ఎక్కువ సేపు గుల్లమాదిరిగా కన్పించాలంటే ఈ ప్రాసెను ను ఫాలో అవ్వాలి. ముందుగా గోధుమ పిండిని ఒక బెసన్ లో తీసుకొవాలి. ఆతర్వాత.. దానిలో నీళ్లను వేసి పిండి అంతా ఒక్క దగ్గరకు వచ్చేలా కలపాలి.

Read More: How To Make Egg Curry: బ్యాచిలర్ బ్రదర్స్ ఈ ఎగ్ కర్రీ మీకోసమే..కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకునే సింపుల్ రెసిపీ..

కొద్దిగా నూనె చుక్కలను కూడా వేయాలి. అప్పుడు పిండి అంతా ముద్దగా ఒక దగ్గరకు వస్తుంది. చేతికి పిండి ముద్దలు అంటుకొకుండా, చక్కగా పిండిని కలుపుకొవాలి.  కాసేపు తడిపిన పిండిని అలానే ఉంచాలి. ఆతర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొవాలి.  ఇక.. గ్యాస్ స్టౌవ్ మీద కడయిలో నూనె వేసుకుని మిడియంలో గ్యాస్ వెలిగించి  ఉంచాలి. ఉండలను రోటికర్రతో ముందుకు, వెనుక్కు తిప్పుడూ ప్రెస్ చేయాలి.

అప్పటికే కడయ్ లోని నూనె వెడిగా మరిగి ఉంటుంది. మెల్లగా ఇలా ఒక్కొ పూరీని కడయ్ లో వేయాలి. అప్పుడు పూరీలు చూస్తుండగానే పైకి పొంగుకుని వస్తాయి. వీటిని ఒక జాలీ బెసెన్ లో వేయాలి. అప్పుడు నూనె అంతా జాలీ బెసెన్ నుంచి కిందకు వెళ్లిపోతుంది. కొందరు పూరీలను న్యూస్ పేపర్ ల మీద కూడా వేస్తుంటారు. న్యూస్ పేపర్ నూనెను లాగేసుకుంటుంది.

Read More: Salaar - Prabhas: తొలిసారి ఓటీటీలో ఆ భాషలో ప్రభాస్ సలార్ మూవీ.. కాలర్ ఎగరేస్తోన్న ఫ్యాన్స్..

ఇదే ప్రాసెస్ లో మిగతా పిండిముద్దలను కడయ్ లో వేసుకుని పూరీలు చేసుకొవాలి. ఇలా చేస్తే పూరీలు ఎక్కువ సేపు గుల్ల మాదిరిగా పొంగి, చూస్తేనే నోట్లో నీరు ఊరి తినేయాలనిపిస్తుంది. ఇక మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఏంచక్కా పూరీలను తింటూ ఎంజాయ్ చేయోచ్చు. అయితే.. పూరీలకు కాంబినేషన్ గా ఆలుకర్రీ , బఠాణి కర్రీ, టమాటా ను ఎక్కువ మంది తినడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News