Telangana Group 2 Exam Postpone: కొన్ని వారాలుగా నిరుద్యోగులు పోటీ పరీక్షలు వాయిదా వేయాలని చేస్తున్న పోరాటం ఫలించింది. డీఎస్సీ, గ్రూప్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని అలుపెరగని పోరాటం చేస్తుండగా డీఎస్సీ విషయంలో వెనక్కి తగ్గని రేవంత్‌ ప్రభుత్వం.. గ్రూప్‌ 2 విషయంలో మాత్రం వెనక్కి తగ్గింది. గ్రూప్‌ 2 పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగులతో చర్చలు జరిపిన ప్రభుత్వ ప్రతినిధులు వాయిదాకే మొగ్గుచూపారు. ఈ క్రమంలో టీజీపీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రకటన జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana Police: అమ్మనా బూతులతో రెచ్చిపోతున్న తెలంగాణ పోలీసులు.. కేటీఆర్‌, నెటిజన్లు ఆగ్రహం


పరీక్షలు వాయిదా వేయాలని.. గ్రూప్స్‌ పరీక్షల పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూపు 2, గ్రూపు 3 పరీక్షల కోసం పట్టుబట్టారు. గ్రూప్‌ 2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సి  ఉంది. 783 పోస్టుల భర్తీపై గ్రూపు 2 ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ వాయిదాతో గ్రూప్‌ 2 పరీక్షలు నాలుగు సార్లు వాయిదా పడడం గమనార్హం. ఇక 1,388 గ్రూపు 3 ఉద్యోగాల భర్తీకి నవంబర్‌ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మరి గ్రూపు 3 విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

Also Read: Police Lathi Charge: రాత్రిపూట నిరుద్యోగులపై విరిగిన పోలీస్‌ లాఠీ.. చిక్కడపల్లి లైబ్రరీ దిగ్బంధం


కాగా నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. డీఎస్సీ పరీక్షల విషయంలో కూడా అదే పట్టుబట్టగా.. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. అయినా కూడా వాయిదా వేయాలని అభ్యర్థులు వీధి పోరాటంతోపాటు న్యాయ పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగుల ఉద్యమంతో ప్రభుత్వంపై తీవ్ర చెడ్డ పేరు రావడంతో వెంటనే రంగంలోకి దిగిన రేవంత్‌ సర్కార్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరుద్యోగులతో చర్చలు జరిపిన తర్వాతి రోజే గ్రూప్‌ 2 వాయిదా పడడం విశేషం. మిగతా పరీక్షలు కూడా వాయిదా వేసే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి