Telangana unlock news updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గి పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో రాష్ట్రంలో జూన్ 20 నుంచి లాక్ డౌన్ ఎత్తివేయాలని నిన్న శనివారం జరిగిన కేబినెట్ భేటీలో (Telangana cabinet meeting) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఇవాళ్టి నుంచి రాష్ట్పంలో అన్‌లాక్ (Unlock) ప్రారంభమై అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు వంటి ప్రజా సేవలతో పాటు దుకాణాలు, దుకాణ సముదాయాలు, ఇతర కార్యాలయాలు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలు కలిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Marriages, Temples, Theatres, pubs- ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, పబ్బులు:
నేటి నుంచి రాష్ట్రంలో అన్‌లాక్ ప్రారంభమై అన్ని సేవలు అందుబాటులోకి రానున్నప్పటికీ.. ఆలయాలు, థియేటర్లు, పబ్బులు, ఎగ్జిబిషన్ సెంటర్లు, వివాహాలు, బహిరంగ సభలు, సమావేశాలు వంటి పబ్లిక్  గేదరింగ్స్‌పై పూర్తి స్థాయిలో ఆంక్షలు ఎత్తివేసినట్టేనా లేదా అనేది తెలియాల్సి ఉంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో జనం భారీ సంఖ్యలో పాల్గొంటుండం వల్లే కరోనా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాల్సిన అంశం.


Also read: Telangana COVID-19 updates: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు


Schools and colleges reopening- విద్యా సంస్థలు పునఃప్రారంభం:
ఇక జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం కూడా తెలిసిందే. దీంతో జూలై 1 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం బస్సు పాసులు జారీ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా టిఎస్ఆర్టీసీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. Read more: Schools reopening in Telangana: స్కూల్స్ పునఃప్రారంభంపై కేబినెట్ భేటీలో నిర్ణయం


TSRTC Services- టిఎస్ఆర్టీసీ బస్సు సేవలు:
లాక్‌డౌన్‌కి ముందు తరహాలోనే యధావిధిగా ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితేస లాక్‌డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలులో ఉన్న పొరుగు రాష్ట్రాలు, తెలంగాణ మధ్య రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రస్తుతానికి ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షలు ఎత్తివేసిన అనంతరమే ఆ రాష్ట్రాలకు బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి. 


Also read : TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ పొడిగింపు


Hyderabad metro rail- హైదరాబాద్ మెట్రో రైలు సేవలు
అలాగే హైదరాబాద్ మెట్రో రైలు సైవలు (last Hyderabad metro train timings in night) సైతం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు సర్వీసు రాత్రి 9 గంటలకు స్టేషన్ నుంచి ప్రారంభమై రాత్రి 10 గంటలకు టెర్మినల్ చేరుకుంటుందని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు వెల్లడించారు.


Also read: TS Entrance Exams 2021 Postponed: తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదాకు ఉన్నత విద్యా మండలి నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook