Telangana VRAs: ఇప్పుడే మాకు అసలైన పండగ : వీఆర్ఏ జేఏసీ ప్రతినిధులు
Good News to Telangana VRAs: కొత్త సెక్రటేరియట్లో మొట్టమొదటిసారిగా జరిగిన కేబినెట్ భేటీలో వీఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయాలనీ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్బంగా మాకు ఈ శుభ వార్త చెప్పడం మరింత సంతోషంగా ఉంది అని వీఆర్ఏల సంఘాల జేఏసి ప్రతినిధులు ఆనందం వ్యక్తంచేశారు.
Good News to Telangana VRAs: రాష్ట్రంలో 23 వేల మంది విఆర్ఏలు పని చేస్తున్నారు. 2017 ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మమల్ని పిలిచి మరీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు యూనియన్లుగా విడిపోయి 80 రోజుల పాటు జాయింట్ యాక్షన్ కమిటీతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలం అందరం ఆందోళన చేశాం. 2021లో ప్రగతి భవన్‌లో మంత్రులు హరీశ్ రావు, కల్వకుంట్ల తారక రామారావులు మాకు స్ఫష్టమైన హామీ ఇవ్వడంతో అప్పట్లో ఆందోళన విరమించుకున్నాం. ఆనాడు మాకు సర్కారు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంది అని వీఆర్ఏల అసోసియేషన్ జేఏసీ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు.
మా సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అప్పటి సీసీఎల్ఎ కమిషనర్ సోమేశ్ కుమార్‌లకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల తరపున తాము ధన్యావాదాలు చెప్పుకుంటున్నాం అని వీఆర్ఏల సంఘాల జేఏసి ప్రతినిధులు మీడియాకు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన సెక్రెటేరియట్‌లో మొట్టమొదటిసారిగా జరిగిన కేబినెట్ భేటీలో వీఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయాలనీ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్బంగా మాకు ఈ శుభ వార్త చెప్పడం మరింత సంతోషంగా ఉంది అని వీఆర్ఏల సంఘాల జేఏసి ప్రతినిధులు ఆనందం వ్యక్తంచేశారు.
రేపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలనీ నిర్ణయించుకున్నట్టు ప్రకటించిన వీఆర్ఏల సంఘాల జేఏసి ప్రతినిధులు... ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విఆర్ఏల కుటుంబాల్లో ఇవాళే ఎంతో సంతోషకరమైన రోజు అవుతుంది అని అన్నారు. ప్రతీ విఆర్ఏ కుటుంబం సీఎం కేసీఆర్ కి ఎంతో ఋణపడి ఉంటుంది. సీఎం కేసీఆర్ ఏ హామీ ఇచ్చిన అది నెరవేర్చుతారు అని నిరూపించుకున్నారు. ఇవాళ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మాకు మర్చిపోలేని రోజు అని వీఆర్ఏల సంఘాల జేఏసి ప్రతినిధులు పేర్కొన్నారు. సెక్రెటరియేట్ మీడియా సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ వీఆర్ఏల సంఘాల జేఏసి ప్రతినిధులు ఈ వ్యాఖ్యలు చేశారు.