Hyderabad Rains: భాగ్యనగరంలో హైఅలర్ట్.. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త
భారీ వర్షాలు తెలంగాణను ( Telangana ) ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అటు ఆంధ్రప్రదేశ్ ( AP ) లోనూ పరిస్థితి అలాగే ఉంది.
భారీ వర్షాలు తెలంగాణను ( Telangana ) ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అటు ఆంధ్రప్రదేశ్ ( AP ) లోనూ పరిస్థితి అలాగే ఉంది. భారీ వర్షాల వల్ల కృష్ణా, గోదావరి, మూసీ నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తాజాగా హిమాయత్ సాగర్ లో భారీగా వరద నీరు తరలి వస్తోండటంతో జలశయం గేట్లు అధికారు ఎప్పుడైనా తెరిచే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.
ALSO READ| Dharani: దసరా రోజు ధరణి పోర్టల్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
మూసీ నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాలపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే చాదర్ ఘాట్, అప్జల్ గంజ్, జియాగూడ ప్రాంతాల్లో చాలా మంది చేపల వేటకు వెళ్తుండడంతో స్థానికులు భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అదే సమయంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని ప్రజలకు వాటర్ బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ALSO READ| Rice ATM : హైదరాబాద్ లో 12 వేల మంది కడుపు నింపిన రైస్ ఏటీఎం
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR