Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు, రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం
Heavy Rains: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుండటంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఇప్పుడు రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. వాయుగుండంగా మారకుండానే బలహీనపడటంతో వర్షాల ప్రభావం కాస్త తగ్గింది. అయితే ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుండటంతో తెలంగామలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇవాళ, రేపు రాష్ట్రంలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, అదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
నిన్న అంటే బుధవారం తెలంగాణలోని ఏటూరు నాగారంలో 123.3 మిల్లీమీటర్లు, సూర్యాపేట జిల్లా టేకుమట్‌లో 56.5 మిల్లీమీటర్లు, అదిలాబాద్ జిల్లా బజరహత్నూర్‌లో 46 మిల్లీమీటర్లు, వరంగల్ జిల్లా ఏనుగల్‌లో 45 మిల్లీమీటర్లు, సంగారెడ్డి జిల్లా మల్చెల్మలో 44.8 మిల్లీమీటర్లు, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 42.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రి మోస్తరు వర్షం కురిసింది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం పడే సూచనలున్నాయి. రేపు కూడా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Also read: Bank Holidays October 2024: అక్టోబర్‌లో అన్నీ సెలవులే, 15 రోజులు మూతపడనున్న బ్యాంకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.