Telangana Summer Temperatures: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గం.-10గంటలకే ఎండ చురుక్కుమంటోంది. దీంతో ఉదయం పూట బయటకు వెళ్లాలన్నా జనం జంకుతున్న పరిస్థితి. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు కదలట్లేదు. రాష్ట్రంలో బుధవారం (ఏప్రిల్ 27) అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 10 జిల్లాల్లో 43.9 డిగ్రీల నుంచి 44.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు (ఏప్రిల్ 28, 29) ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉదయం 8.30గంటలకు అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీహెచ్ఎంసీలో బేగంపేటలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 


ఇవాళ ఉదయం 8.30గంటలకు అత్యల్పంగా నల్గొండలో 24.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో హయత్‌నగర్‌లో అత్యల్పంగా 24 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 


రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు  : 


ఇవాళ్టి (ఏప్రిల్ 28) నుంచి వచ్చే మే 3 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30కి.మీ-40కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మే 3, 5 తేదీల్లో వాతావరణంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని పేర్కొంది.




Also Read: GT vs SRH IPL 2022: ఉమ్రాన్ మాలిక్ బంతికి హార్దిక్ విలవిల.. ఆందోళనలో హార్దిక్ సతీమణి నటాషా!


Also Read: Chiranjeevi Acharya: పవన్ కల్యాణ్ కోసం 'ఆచార్య' మూవీ స్పెషల్ స్క్రీనింగ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook