GT vs SRH IPL 2022: ఉమ్రాన్ మాలిక్ బంతికి హార్దిక్ విలవిల.. ఆందోళనలో హార్దిక్ సతీమణి నటాషా!

GT vs SRH IPL 2022: గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఈ మ్యాచ్ లో పేసర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతి బ్యాటర్ హార్దిక్ పాండ్యా భుజానికి బలంగా తాకింది. ఆ సమయంలో తన భర్తకు ఏం జరిగిందోనని హార్దిక్ భార్య స్టాండ్స్ లో ఆందోళనగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 10:38 AM IST
GT vs SRH IPL 2022: ఉమ్రాన్ మాలిక్ బంతికి హార్దిక్ విలవిల.. ఆందోళనలో హార్దిక్ సతీమణి నటాషా!

GT vs SRH IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బుధవారం గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన పోరాటం చేసి గెలిచింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్ బెర్త్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు దాదాపుగా ఖరారు చేసుకున్నట్లైంది. గుజరాత్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో అనూహ్యమైన ఘటన జరిగింది. 

సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 25 పరుగులు సమర్పించి 5 వికెట్లు పడగొట్టి.. గుజరాత్ విజయాన్ని ఇంకొద్దిగా ఆలస్యం చేశాడు. ఈ మ్యాచ్ లోని 8వ ఓవర్ లో ఉమ్రాన్ బౌలింగ్ కు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నాడు. 

అదే సమయంలో ఉమ్రాన్ వేసిన స్పీడ్ బౌలింగ్ లో హార్దిక్ కుడి భుజానికి బంతి తాకింది. వెంటనే నొప్పికి లోనైన హార్దిక్ పాండ్యా.. చేతిని నొక్కడం ప్రారంభించాడు. దాన్ని చూసి టీమ్ ఫిజియో గ్రౌండ్ లోకి వచ్చాడు. కానీ, ఫిజియోను హార్దిక్ పాండ్యా అడగలేదు. అయితే స్టాండ్స్ లో ఉన్న హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిక్ మాత్రం.. తన భర్తకు ఏమైందనే ఆందోళనతో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.  

Also Read: GT vs SRH: చివరి ఓవర్లో రషీద్ ఖాన్ వీరవిహారం.. సన్‌రైజర్స్‌పై గుజరాత్ సూపర్ విక్టరీ!

Also Read: CSK Fan Girl: అంబటి రాయుడు భారీ సిక్సులు.. వైరల్‌గా మారిన చెన్నై ఫ్యాన్ గర్ల్ రియాక్షన్! ఆమె మరెవరో కాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News