Telangana Weather: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు... ఆ జిల్లాల్లో వడగాల్పులు...
Telangana Summer Temperature: తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెలలోనే ఎండలు ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Telangana Summer Temperature: తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెలలోనే ఎండలు ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
అలాగే, శుక్రవారం (మార్చి 18) పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. సముద్ర మట్టానికి సుమారు 0.9కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడినట్లు వెల్లడించింది. తెలంగాణకు పొరుగున ఉన్న విదర్భ తూర్పు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 మీటర్ల ఎత్తున విస్తరించి ఉన్నట్లు తెలిపింది.
తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మున్ముందు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. రోజురోజుకు ఎండ వేడిమి పెరిగిపోతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు భయపడుతున్నారు. సాయంత్రం 4 తర్వాతే పనుల కోసం బయటకు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఉదయం 10 గంటల లోపే పనులు చక్కపెట్టుకుని ఇళ్లకు చేరుతున్నారు.
Ananya Pande: వామ్మో.. ఇదేం ఎక్స్‌పోజింగ్.. బర్త్ డే పార్టీలో విజయ్ దేవరకొండతో అనన్య హల్‌చల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook