Weather forecast: ఈసారి ఎండలు మండిపోవడం ఖాయం- రికార్టు స్థాయిలో ఉష్టోగ్రతలు!

Weather forecast: చలికాలం పోయి ఎండాకాలం ప్రారంభమైంది.  వేసవి తొలినాళ్లలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ సారి వేసవి ఉష్టోగ్రతలు సాధారణంకన్నా ఎక్కువగా ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తోంంది.  

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 11:30 AM IST
  • రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు
  • వేసి ఆరంభంలోనే భానుడి ప్రతాపం
  • ఉష్టోగ్రతలు పెరగొచ్చని ఐఎండీ అంచనా!
Weather forecast: ఈసారి ఎండలు మండిపోవడం ఖాయం- రికార్టు స్థాయిలో ఉష్టోగ్రతలు!

Weather forecast: గత కొన్నాళ్లుగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు ఇటీవల చెన్నై నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. తిరుపతి సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లోనూ వర్షాలు భీభత్సం సృష్టించడం గమనార్హం.

ఇప్పుడు ఎండాకాలం ప్రారంభమైంది. సాధారణంగా శివరాత్రి ముగిసిన తర్వాత ఎండలు పెరుగుతాయని చెబుతుంటారు. ఇది సంప్రదాయ నానుడి అయినప్పటికీ.. ఇప్పటేకి ఎండాకాలం ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఆరంభ దశలోనే ఎండలు మండిపోతున్నాయి.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శాఖ ఎండాకాలానికి దేశవ్యాప్తంగా సాధారణం కన్నా ఎక్కువ ఉష్టోగ్రతలు నమోదవ్వచ్చని అంచనా వేసింది. అయితే ఉత్తర భారతంతో పోలిస్తే.. దక్షిణాదిలో భానుడి ప్రతాపం కాస్త తక్కువగా ఉంటుందని చెప్పింది. వివిధ ప్రాంతాల్లో 40 డిగ్రీలపైకి ఉష్టోగ్రతలు చేరొచ్చని వివరించింది.

జమ్ముకశ్మీర్​, రాజస్థాన్​, లద్దాఖ్​, గుజరాత్​, మధ్య ప్రదేశ్​, మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని అంచనా వేసింది ఐఎండీ.

ముఖ్యంగా పగటి పూట రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదవుతాయని.. రాత్రిపూట కూడా వాతావరణం సాధారణం కన్నా వేడిగా ఉంటుందని తెలిపింది ఐఎండీ.

ఎండాకాలం వచ్చిన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యులు. ప్రయాణాలు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పెట్టుకోవడం మంచిదని సూచిస్తుననారు. ఎక్కడికెళ్లినా వాటర్ బాటిల్​ను వెంట తీసకెళ్లాలని సూచిస్తున్నారు. తగినంత నీటిని తాగుతు ఎప్పుడు హైడ్రేటెడ్​గా ఉండాలని చెబుతున్నరు. 

Also read: Kacha Badam singer Bhuban: 'కచ్చా బాదమ్'​ సింగర్​కు రోడ్డు ప్రమాదం.. ఆస్ప‌త్రిలో చేరిక‌..

Also read: Jharkhand Boat Accident: జార్ఖండ్‌లో విషాదం...నదిలో పడవ బోల్తా.. 14 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News