telangana weather update: మండే ఎండల్లో అకాలవర్షాలు జనానికి ఉపశమనం ఇస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలు వర్షాలతో కాస్త సేదదీరారు. తెలంగాణ వ్యాప్తంగా గత రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఎండల తీవ్రత గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రమట్టానికి 0.9 కిమీ ఎత్తున విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో  బుధవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్సున్నట్లు ఐఎండీ ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని చెప్పింది. అయితే ఈ నెల 6 వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశమున్నట్లు తెలిపింది. గరిష్ణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సీయస్ వరకు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనావేసింది. 


ఐఎండీ అంచనాల ప్రకారం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చు. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30 నుంచి 50 కి.మీ వేగం) కూడిన వర్షాలు కురిసే ఛాన్సుంది. 


హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మెదక్, సూర్యాపేట , వరంగల్, కరీంనగర్ .. మరొకొన్ని జిల్లాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిసాయి. వర్షాల ధాటికి హైదరాబాద్ లో పలు కాలనీలు నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెట్లు కూలిపోవడంతో చాలా చోట్ల కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఇక జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న వరిధాన్యం కొట్టుకుపోయింది. రైతులు నోటికాడి పంట నీటిపాలుకావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 


also read: Hyderabad: మీ ఏరియాలో విద్యుత్‌ అంతరాయమా? అయితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి!


also read: Vishwak Sen Ban: విశ్వక్ సేన్ పై మంత్రి ఆగ్రహం.. హీరోపై బ్యాన్ విధించే అవకాశం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.