Rain Alert To Telugu States: గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ఇంకా వరద నీరు అలాగే ఉండిపోయింది. రెండు రోజులు కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు.. మళ్లీ తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. తెలంగాణలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు (మంగళవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. వర్షం కురిసింది కాసేపే అయినా.. కుండపోతగా కురవడంతో రోడ్లపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరుస సెలవుల నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ఉద్యోగులు సోమవారం ఆఫీసులకు పయనమవుతున్నారు. మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు భయపెడుతున్నాయి. భారీ`వర్షాల హెచ్చరికలతో స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించగా.. పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 


అటు ఆంధ్రప్రదేశ్‌లో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుండగా.. ప్రస్తుతం ఒడిశా, విశాఖకు దగ్గర్లో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో వల్ల తెలుగు రాష్ట్రాలకు రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఎక్కువగా ప్రభావ ఉంటుందని అంటున్నారు. నేడు ఆయా ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. 


మరోవైపు ధవళేశ్వరం వద్ద నేటి నుంచి వరద తగ్గుముఖం పట్టనుంది. ఇన్, ఔట్ ఫ్లో 16.32 లక్షల క్యూసెక్కులు ఉంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 49.5 అడుగులుగా ఉంది. 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. NDRF, SDRF బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల శాఖ హెచ్చరిస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  


Also Read: Defective ITR: డిఫెక్టివ్ ఐటిఆర్ అంటే ఏంటి ? దీంతో నష్టమా ?


Also Read: Train Travel Insurance: 35 పైసలతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా..!    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి