Train Travel Insurance: 35 పైసలతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా..!

How To Get Train Travel Insurance: 35 పైసలతో ఐఆర్‌సీటీసీ ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చు. రైల్వే టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. రూ.10 లక్షల కవరేజీ పొందొచ్చు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 30, 2023, 07:27 PM IST
Train Travel Insurance: 35 పైసలతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా..!

How To Get Train Travel Insurance: రెండు నెలల కిందట ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు యావత్ దేశాన్ని కన్నీరు పెట్టించింది. ఈ ప్రమాదంలో దాదాపు 275 మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు. ఆ గాయాల నుంచి ఇంకా చాలా మంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇలా రైలు ప్రమాద ఘటనల్లో మరణించిన వారికి, గాయపడిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తుంది. ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ దీనికి తోడు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తే.. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఉపయోగపడతాయి. ఐఆర్‌సీటీసీ కేవలం 35 పైసలతోనే రూ.10 లక్షల ఇన్సూరెన్స అందిస్తోంది. ఈ పథకం పూర్తి వివరాలు ఇలా.. 

ఐఆర్‌సీటీసీలో రైల్వే టికెట్‌ను బుక్ చేసే సమయంలో టికెట్‌తో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కేవలం 35 పైసలు మాత్రమే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అనుకోని రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ డబ్బులు పొందొచ్చు. రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు బీమా కంపెనీ రూ.10 లక్షల పరిహారం అందిస్తాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి సెక్షన్ 123, 124, 124A కింద.. రైల్వే చట్టం 1989 ప్రకారం ఐఆర్‌సీటీసీ నిబంధనలు రూపొందించింది. 

35 పైసల ఇన్సూరెన్స్‌కు మీరు బుక్ చేసుకునే క్లాస్‌తో సంబంధం లేదు. ప్రతి తరగతికి సమాన కవరేజీ అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేసుకున్నా.. స్లీపర్ బెర్త్ బుక్ చేసుకున్నా.. కేవలం 35 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది.

రైలు ప్రమాదంలో మరణిస్తే.. రూ.10 లక్షలు, శాశ్వతంగా పూర్తి వైకల్యం పొందినా రూ.10 లక్షలు అందుతాయి. శాశ్వత పాక్షిక వైకల్యం పొందితే.. రూ.7.50 లక్షలు, ఆసుపత్రి చికిత్సకు రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. రవాణా ఖర్ఛులకు రూ.10 వేల వరకు అందుతాయి. రైలు ప్రమాద సమయంలోనే కాకుండా.. టెర్రరిస్టులు, దొంగల ముఠా, అల్లరి మూకలు దాడి చేసిన సమయంలోనూ కవరేజీ వర్తిస్తుంది. 

35 పైసలతో తీసుకున్న ఇన్సూరెన్స్ వర్తించాలంటే.. టికెట్‌ను కచ్చితంగా ఐఆర్‌సీటీసీ‌లోనే బుక్ చేసుకోవాలి. అంటే ఈ-టికెట్లను బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక పీఎన్‌ఆర్ నంబర్ నుంచి బుక్ చేసుకున్నా.. అన్ని టికెట్లకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. అన్ని టిక్కెట్లకు సమానంగా వర్తిస్తుంది. ఈ ప్రయాణ బీమా సౌకర్యం టికెట్ కన్ఫార్మ్ అయినవారికి, ఆర్‌ఏసీలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. జనరల్ టికెట్ తీసుకున్నా.. ఆఫ్‌లైన్‌లో కౌంటర్‌లో టికెట్‌ బుక్ చేసుకున్నా ఇన్సురెన్స్ సౌకర్యం లభించదు. ఐదేళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న పిల్లలకు వర్తించదు.  

Also Read: GST On Hostels: హాస్టల్స్, పీజీలో ఉంటున్న వారికి బ్యాడ్‌న్యూస్.. ఫీజుల మోత తప్పదా..?  

Also Read: Telangana Floods: రేపు తెలంగాణకు కేంద్ర అధికారుల బృందం.. వరద నష్టంపై అంచనా   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News