Woman Reached Hospital With Snake In Mulugu: మనలో చాలా మంది పాములంటే చచ్చేంత భయపడిపోతుంటారు. పాముల దగ్గరకు వెళ్లడానికి ఎవరూ కూడా ధైర్యం చేయరు. కొన్నిసార్లు పాములు అనుకోకుండా మన ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి. అడవులు, భారీగా ఉన్న చెట్లు, చెరువులు, నదులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. కొందరు పాములు కన్పించగానే, భయంతో అక్కడి నుంచి మాయమైపోతుంటారు. పొరపాటున కూడా పాము కన్పిస్తే, ఆ చోటికి మరల వెళ్లడానికి  అస్సలు ధైర్యం చేయరు. కొందరు పాములను దేవుడి మాదిరిగా కొలుస్తారు. పాములు కన్పించగానే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..


కొందరు పాముల విషయంలో అతిగా చేస్తుంటారు. పాములను ఒళ్లోపెట్టుకుని ముద్దులు పెడుతుంటారు. పాములతో ఆడుకుంటూ తమ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. దీంతో పాముల కాటుకు కూడా గురౌతుంటారు.  కొన్నిసార్లు ఇలాంటి పనులు చేసేటప్పుడు పాముల కాటుకు గురైన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. అదే విధంగా కొన్నిసార్లు పాములు మన పొలంలలో, ఇంటి ఆవరణలో కన్పిస్తుంటాయి. అజాగ్రత్తగా ఉండి ఎందరో పాముల కాటుకు గురైన సంఘటనలు కూడా కొకొల్లలు. కానీ కొందరు పాము కాటేస్తే భయపడకుండా, కాటువేసిన పాములను ధైర్యంగా పట్టుకుని ఆస్పత్రులకు వెళ్తుంటారు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


ములుగు జిల్లా వెంకటాపురంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతామ్మ అనే మహిళ ఉపాధి హమీ పనుల కోసం వెళ్లింది. ఆమెపనులలో ఉండగా ఒక పాము ఆమెను కాటు వేసింది. వెంటనే ఆమె షాక్ కు గురైంది. వెంటనే తెరుకొని చుట్టుపక్కల వారికి పిలిచింది. పామును పారిపోకుండా చేసి చంపింది.


Read More: Romance In Flight: విమానంలో కపుల్ అరాచకం.. 4 గంటల పాటు హగ్గింగ్ చేసుకుంటూ రొమాన్స్.. వైరగా మారిన ఘటన..


చనిపోయిన పామును, బాటిల్ లో బంధించింది. ఆతర్వాత దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను చూసి వైద్యులు భయంతో ఖంగుతిన్నారు. కాటు వేసిన పామును గుర్తించి, యాంటీ వీనమ్ ఇచ్చారు. కుట్టినపాము విషపూరితమైందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం సదరు శాంతమ్మ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మాత్రం వైరల్ గా మారింది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter