Viral Video: నన్నే అడ్డుకుంటావా...?.. హోంగార్డు ఫోన్ పగలకొట్టి రెచ్చిపోయిన మహిళ.. వైరల్ గా మారిన వీడియో ఇదే..
Hyderabad: బంజారాహిల్స్ లో ఒక మహిళ రెచ్చిపోయింది. ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పట్లు దురుసుగా ప్రవర్తించింది. అంతటితో ఆగకుండా నోటికొచ్చిట్లు బూతులు తిట్టింది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.
Woman Traffic Violation in BanjaraHills: కొందరు పోలీసుల మీదనే దాడులకు పాల్పడుతుంటారు. పగలనక, రాత్రనక మన కోసం పోలీసులు ఎంతో కష్టపడుంటారు. అలాంటి పోలీసులపై కొందరు బూతులు తిడుతూ దాడులు చేస్తున్నారు. మెయిన్ గా రోడ్డుమీద ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు అవగాహన కల్పిస్తుంటారు. రాంగ్ రూట్లు, హెల్మెట్ లు పెట్టుకొవడం, త్రిబుల్ రైడింగ్ లు చేయోద్దని చెబుతుంటారు.
ఇంత చెప్పిన కూడా అనేక చోట్ల కొందరు కేటుగాళ్లు పోలీసులమీద దాడులకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల యువకుడు అమీర్ పేట్ మెట్రో వద్ద ట్రాఫిక్ పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు. వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది. తాజాగా, ఈ కోవకు చెందిన మరో ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన జాగ్వార్ కారేసుకుని రాంగ్ రూట్ లో వచ్చింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆమెను అడ్డగించాడు. దీంతో ఆమె రెచ్చిపోయింది. హోంగార్డును బూతూలు తిడుతూ.. నన్ను ఆపుతావా.. రాంగ్ రూట్ లో చాలా మంది వెళ్తుంటారు.. అంటూ బూతులు తిట్టింది. అంతటితో ఆగకుండా.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్పించింది.
Read More: WaterMelon: పుచ్చకాయలను ఎక్కువగా తింటున్నారా..?.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
హోంగార్డు అడ్డుపడుతున్న కూడా కారులో కూర్చుని ముందుకు పోనిచ్చింది. కొందరు ఆమెను సముదాయించే ప్రయత్నం చేసిన కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా, రివర్స్ లో అటాక్ ప్రారంభించింది. ఈ ఘటనను వీడియో తీస్తున్న హోంగార్డు పై దాడిచేసి, బట్టలు చింపేసింది. ఆ తర్వాత ఫోన్ ను తీసుకుని నెలకేసి కొట్టి నానా రచ్చ చేసింది. దీంతో బాధితుడు..బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook