Bandi Sanjay on CM Kcr: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరబడేందుకు రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తగిన బుద్ధి చెబుతున్నారని విమర్శించారు. ప్రజలపై సీఎం కేసీఆర్ రాక్షసత్వంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుర్చీ వేసుకుని సమస్యలను పరిష్కారిస్తామన్న హామీ ఏమయ్యిందని ప్రశ్నించారు. తక్షణమే పోడు భూములు, ధరణి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యాయం చేయమని అడిగే రైతులు, గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్నారని..వారిపై లాఠీలు ఝళిపించి జైల్లో వేస్తున్నారని విమర్శించారు. మహిళలు, బాలింతలని చూడకుండా అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ఆ పార్టీ నేతలు చేపట్టిన మౌన దీక్షలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ధరణి పోర్టల్‌ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని..ఉన్న భూములను కొందరు కబ్జా చేస్తున్నారని చెప్పారు. 


రైతు బంధు నుంచి పేర్లు తీసేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ వల్ల ఎవరికీ మేలు జరిగిందో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకునే వారు లేరన్నారు. ఇప్పటివరకు 15 లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదు కాలేదన్నారు.  దీనిపై ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో బాధితులతో కలిసి ఆందోళన చేస్తామని బండి సంజయ్ తెలిపారు.


Also read:AP, TS Rain Updates Today LIVE*: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ!


Also read:Amma Raja Sekhar: వాడికి డాన్స్‌ రాదు..వాడొక వేస్ట్ ఫెలో..హీరో నితిన్‌పై అమ్మ రాజశేఖర్ హాట్ కామెంట్స్..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook