AP, TS Rain Updates Today LIVE*: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ!

Red alert for Telangana, AP and Hyderabad due to heavy rains. గ‌త 4-5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అతకుతలం అవుతున్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 11, 2022, 10:08 PM IST
  • Telangana Rain Live Updates Today: Rain Alert in Telangana, AP and Hyderabad. గ‌త 4-5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అతకుతలం అవుతున్నాయి.
     
AP, TS Rain Updates Today LIVE*: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ!
Live Blog

Red alert for Telangana, AP and Hyderabad due to Heavy Rains: గ‌త 4-5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అతకుతలం అవుతున్నాయి.  భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటికి ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారిపోయాయి. మరో 2-3 భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవరం ఉంటే తప్ప బయటికి రావొద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు. 

11 July, 2022

  • 22:07 PM

    అఖండ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలంలో 54 అడుగులకు చేరువలో ఉన్న గోదావరి వరద..మూడు ప్రమాద హెచ్చరికల్ని దాటేసింది. 

    ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి మూడు ప్రమాద హెచ్చరికలు దాటేసింది. ప్రస్తుతం అక్కడ 53.80 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది. రేపటివరకూ ఇంకా పెరగవచ్చనే అంచనాలున్నాయి. ఇక రాత్రికి ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ కావచ్చు. రేపు ఉదయం రెండవ ప్రమాద హెచ్చరిక వరకూ చేరుకుని..క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో వదులుతున్నారు. బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. వచ్చిన ఇన్‌‌ఫ్లోను వచ్చినట్టే దిగువకు వదులుతున్న పరిస్థితి.

  • 16:37 PM

    గోదావరికి భారీగా వరద, మూడవ ప్రమాద హెచ్చరిక దిశగా పోటెత్తుతున్న వరద నీరు

    Godavari Floods: గోదావరి నదికి భారీ వరద పోటెత్తుతోంది. నదీ పరివాహక ప్రాంతంల కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక దిశగా..భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక దిశగా వరద వచ్చి చేరుతోంది. 

    గోదావరి నది మరోసారి వరద నీటితో ఉరకలెత్తుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతమైన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా విస్తారణంగా వర్షాలు పడుతుండటంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూలై నెలలో ఎన్నడూ లేనంత వరద వస్తోంది. అదే సమయంలో ఛత్తీస్‌గడ్‌లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరి ఉపనది 

  • 16:14 PM

     రానున్న 3 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. 

  • 15:19 PM

    మరి కొద్దిసేపట్లో భద్రాచలం వద్ద గోదావరి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం 52.60 అడుగులకు నీటిమట్టం చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 8.80 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతోంది. రాత్రికి ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. 

  • 14:23 PM

    గత మూడు రోజులుగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. వరద పోటెత్తడంతో నాసిక్‌ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో నాసిక్‌లో పలు ఆలయాలు నీటమునిగాయి.

  • 14:18 PM

    తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. దీంతో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. సోమ, మంగళ వారాల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను అధికారులు వాయిదావేశారు. ఈ పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

  • 14:16 PM

    భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. లింగపల్లి-హైదరాబాద్‌ మధ్య ఎంఎంటీఎస్‌ రాకపోకలను నిలిపివేసింది. ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య తాత్కాలికంగా నిలిపివేసింది. 

  • 13:27 PM

    ఎగువ నుంచి వస్తున్న వరదలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌ (ఎస్సారెస్పీ) నుంచి భద్రాచలం వరకు ప్రవాహ ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. ప్రాజెక్టులో 99,850 క్యూసెక్కులు వరద నీరు ప్రవహిస్తుండగా.. 9 గేట్ల ద్వారా 41వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా..  ప్రస్తుతం 1087.8 అడుగులు ఉంది.
     

  • 12:53 PM

    ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జులై 14 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.
     

  • 12:36 PM

    గ‌త నాలుగైదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ జంట జ‌లాశయాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. నగర శివార్ల‌లోని ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌కు భారీగా వ‌ర‌ద కొన‌సాగుతోంది. 
     

Trending News